Andrea Jeremiah: మూడేళ్ల తర్వాత.. తెరపైకి ఆండ్రియా చిత్రం

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:16 PM

తమిళ చిత్రపరిశ్రమలో బిజీగా ఉండే హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు. ఆమె నటించిన ‘కా’ చిత్రం మూడేళ్ల తర్వాత విడుదలకు నోచుకోనుంది. నిజానికి గత ఏడాది ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదని చెప్పాలి. ఆమె నటించిన ‘అనల్‌ మేల్‌ పనితులి’ 2022లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు గత ఏడాది విడుదలైనప్పటికీ.. ఆశించిన రీతిలో ప్రేక్షకాదారణ పొందలేదు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ‘కా’ చిత్రం చాలా రోజుల తర్వాత విడుదలకు సిద్ధమైంది.

Andrea Jeremiah: మూడేళ్ల తర్వాత.. తెరపైకి ఆండ్రియా చిత్రం
Andrea Jeremiah

తమిళ చిత్రపరిశ్రమలో బిజీగా ఉండే హీరోయిన్లలో ఆండ్రియా (Andrea Jeremiah) ఒకరు. ఆమె నటించిన ‘కా’ (Kaa) చిత్రం మూడేళ్ల తర్వాత విడుదలకు నోచుకోనుంది. నిజానికి గత ఏడాది ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదని చెప్పాలి. ఆమె నటించిన ‘అనల్‌ మేల్‌ పనితులి’ 2022లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు గత ఏడాది విడుదలైనప్పటికీ.. ఆశించిన రీతిలో ప్రేక్షకాదారణ పొందలేదు. అయినప్పటికీ వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటు తమిళం, అటు తెలుగు భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ‘కా’ చిత్రం చాలా రోజుల తర్వాత విడుదలకు సిద్ధమైంది. (Kaa Movie Ready to Release)


Andrea.jpg

ఇందులో ఆండ్రియా సోలో హీరోయిన్‌గా వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ (Photographer) పాత్రను పోషించారు. తన వృత్తిలో భాగంగా అడవి జంతువులను ఫొటోలు తీసేందుకు దట్టమైన అడవిలోకి వెళ్లి చిక్కుకుంటారు. అక్కడ ఉండే క్రూరమృగాల నుంచి ఆమె ఎలా బయటపడ్డారన్నదే ఈ చిత్ర కథ. షాలోం స్టూడియో పతాకంపై జాన్‌ మైక్స్‌ నిర్మించగా, నాంజిల్‌ (Nanjil) దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియాతో పాటు మారిముత్తు, కమలేష్‌ తదితరులు నటించగా, కెమెరా అరివళగన్‌, సంగీతం సుందర్‌ సి.బాబు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

****************************

*Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్

**************************

Updated Date - Mar 07 , 2024 | 11:16 PM