మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sreeleela: అతని పక్కన అవకాశం అంటే మామూలు విషయం కాదు!

ABN, Publish Date - Apr 22 , 2024 | 06:07 PM

‘ధమాక’ సినిమా తర్వాత టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది శ్రీలీల. వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొంది. అయితే ఇటీవల విడుదలైన ఆమె చిత్రాల్లో  ‘భగవంత్‌ కేసరి’ తప్ప ఇంకేదీ సరైన విజయం అందుకోలేకపోయింది.

Shree leela

‘ధమాక’ సినిమా తర్వాత టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది శ్రీలీల (Sree leela). వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొంది. అయితే ఇటీవల విడుదలైన ఆమె చిత్రాల్లో  ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth kesari) తప్ప ఇంకేదీ సరైన విజయం అందుకోలేకపోయింది. వరుస అవకాశాలు అందుకుంటూనే పరాజయాలను చవిచూసింది. దీంతో ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంది. తాజాగా ఆమెకు ఓ అద్భుత అవకాశం వచ్చిందని టాక్‌ నడుస్తోంది.

Manushi Chillar: నాకు ఏజ్‌తో సంబంధం లేదు.. న్యాయం చేయాలంతే!



కోలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు అజిత్‌ (Ajith kumar) హీరోగా ‘మార్క్‌ ఆంటోనీ’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ (good bad ugly). మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది.  త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రీలీలను వరించినట్లు కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని.. కథ నచ్చడంతో అంగీకరించిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ నిజంగా ఓకే అయితే శ్రీలీల కెరీర్‌ గ్రాఫ్‌ మారిపోతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ తో సినిమా అంటే ఆమె కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Updated Date - Apr 22 , 2024 | 06:33 PM