Manushi Chillar: నాకు ఏజ్‌తో సంబంధం లేదు.. న్యాయం చేయాలంతే!

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:04 PM

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ (Manushi Chillar) గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవల ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (operation valentine) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో (bollywood) వరుస చిత్రాల్లో నటిస్తోంది.

Manushi Chillar:  నాకు ఏజ్‌తో సంబంధం లేదు.. న్యాయం చేయాలంతే!

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ (Manushi Chillar) గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవల ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (operation valentine) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో (bollywood) వరుస చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. రామ్‌చరణ్‌ను తాను ఎంతగానో అభిమానిస్తున్నట్లు చెప్పారు. ‘‘చరణ్‌ 9Ram charan) అంటే నాకెంతో ఇష్టం. డ్యాన్స్‌ అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆయనతో స్క్రీన్ షేర్  చేసుకోవాలనుకుంటున్నా. నా తదుపరి తెలుగు చిత్రం ఆయనతోనే ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

Mabushi.jpg
తాజాగా ఆమె బాలీవుడ్‌లో ‘బడే మియా ఛోటే మియా’ (bademiya Chote miya) చిత్రంలో నటించారు. వయసులో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన అక్షయ్‌ కుమార్‌తో నటించడం పట్ల ఆమె స్పందించారు. ‘‘ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ విభిన్న అభిప్రాయాలున్నాయి. వయసులో పెద్దవారైన పలువురు స్టార్‌ హీరోలతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, స్టార్స్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చు. అక్షయ్‌ కుమార్‌ సూపర్‌స్టార్‌. ఆయనతో వర్క్‌ చేయడాన్ని నేనెంతగానో ఎంజాయ్‌ చేశా. ఎంతోమంది ఆయనతో స్క్రీన్ షేర్  చేసుకోవాలనుకుంటారు. కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. తమ చిత్రాల్లోకి నటీనటులుగా  ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుల నిర్ణయం. కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడుకోవడం లేదు. అగ్ర నటులతోనే కాకుండా యువ హీరోల చిత్రాల్లోనూ నటించాలనుకుంటున్నా’’ అని మానుషి అన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 05:04 PM