Rakul Preeth singh: చెప్పాలని ఉంది.. కానీ ఇంకా టైమ్‌ ఉంది!

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:49 AM

పెళ్లి తర్వాత మళ్లీ జోరు మీదుంది రకుల్‌ప్రీత్  సింగ్‌ (Rakul preeth singh). త్వరలో ‘భారతీయుడు 2’ (indian2)తో తెరపై అలరించడానికి రెడీ అవుతోంది. అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal haasan)ప్రధాన పాత్రలో శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది

Rakul Preeth singh: చెప్పాలని ఉంది.. కానీ ఇంకా టైమ్‌ ఉంది!

పెళ్లి తర్వాత మళ్లీ జోరు మీదుంది రకుల్‌ప్రీత్  సింగ్‌ (Rakul preeth singh). త్వరలో ‘భారతీయుడు 2’ (indian2)తో తెరపై అలరించడానికి రెడీ అవుతోంది. అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal haasan)ప్రధాన పాత్రలో శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇందులో కాజల్‌, సిద్థార్థ్‌లతో పాటు ఓ కీలక పాత్రలో రకుల్‌ మెరవనుంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ మాట్లాడుతూ ఈ సినిమాలోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 

Rakul 2.jpeg

‘‘ఇది కచ్చితంగా నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో నేను పోషించిన పాత్ర కూడా గత చిత్రాలు అన్నింటికంటే భిన్నంగా ఉండనుంది. ఈ చిత్రంలో నేను ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపించనున్నాను. అనుకున్న దాన్ని ఎలా సాధించాలో ఆమెకు బాగా తెలుసు. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేస్తున్నన్ని రోజులు ..ఈ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉందనే భావన కలిగింది. మరిన్ని విషయాలు వెల్లడించడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. అయితే దానికి ఇంకా టైమ్‌ ఉంది. శంకర్‌ సర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి కలిగించింది’ అని తెలిపింది. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే2’ చిత్రీకరణతో బిజీగా ఉంది రకుల్‌ప్రీత్  సింగ్‌.

Updated Date - Jun 10 , 2024 | 09:49 AM