Premalu on Ott: ‘మోడ్రన్‌ లవ్‌ ఫీస్ట్‌' ఎప్పుడు.. ఎక్కడంటే!

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:09 PM

మలయాళంలో  విడుదలై సూపర్‌హిట్‌ సాధించిన 'ప్రేమలు' (Premalu) చిత్రం అదే టైటిల్‌తో తెలుగులో విడుదలై సంచలనం సృష్టించింది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి గిరీశ్ ఎ.డి. (girish Ad) దర్శకుడు.

Premalu on Ott: ‘మోడ్రన్‌ లవ్‌ ఫీస్ట్‌' ఎప్పుడు.. ఎక్కడంటే!
Premalu, SS Karthikeya

మలయాళంలో  విడుదలై సూపర్‌హిట్‌ సాధించిన 'ప్రేమలు' (Premalu) చిత్రం అదే టైటిల్‌తో తెలుగులో విడుదలై సంచలనం సృష్టించింది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి గిరీశ్ ఎ.డి. (girish Ad) దర్శకుడు. నస్లెన్‌ కె.గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమితా బైజూ (Mamitha baiju) కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా అందించేందుకు సిద్థమైంది. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్  కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా ఎక్స్‌లో షేర్‌ చేసింది. ‘మోడ్రన్‌ లవ్‌ ఫీస్ట్‌కు సిద్థంగా ఉండండి’ అని పేర్కొంది. ఇదే రోజున డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఇది స్ట్రీమింగ్  కానుంది.

కథ:

సచిన్‌ సంతోష్‌ (నాస్లెన్‌ కె.గఫూర్‌) ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విషయాన్ని చెప్పేందుకు ధైర్యం చేయలేకపోతాడు. కాలేజీలో చివరిరోజు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆ అమ్మాయేమో అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉన్నానని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమలో విఫలమైన సచిన్‌... యూకే వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. తీరా చూస్తే వీసా రాదు. దాంతో గేట్‌ కోచింగ్‌ కోసం స్నేహితుడు  అమూల్‌ డేవిస్‌ (సంగీత్‌ ప్రతాప్‌)తో కలిసి హైదరాబాద్‌ చేరుకుంటాడు. అక్కడే రీనూ (మమిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లి వేడుకలో వీరిద్దరూ కలుస్తారు. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. ఈ సారైన సచిన్‌ ప్రేమకథ ఫలించిందా? లేక మళ్లీ అతని హార్ట్‌ బ్రేక్‌ అయ్యిందా? అన్నది కథ.


Family Star- Asha Borra: వాడుకుని వదిలేసేదానికి ఇంతోటి హంగామా ఎందుకు.. టైమ్‌ వేస్ట్‌!




Updated Date - Apr 07 , 2024 | 03:09 PM