Prabhas: యుద్థభూమిలో కలుద్దాం.. పృథ్వికి ప్రభాస్ మెసేజ్

ABN , Publish Date - Mar 10 , 2024 | 02:32 PM

‘సలార్‌’(Salaar) చిత్రంలో తెలుగు తెరకు పరిచయమయ్యారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran). ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ఈ చిత్రంలో వరద రాజమన్నార్‌ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Prabhas: యుద్థభూమిలో కలుద్దాం.. పృథ్వికి ప్రభాస్ మెసేజ్


‘సలార్‌’(Salaar) చిత్రంలో తెలుగు తెరకు పరిచయమయ్యారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran). ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ఈ చిత్రంలో వరద రాజమన్నార్‌ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’ (The goat life) మలయాళంలో ‘ఆడు జీవితం’ పేరుతో తెరకెక్కింది. గోట్‌ డేస్‌ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అమలాపాల్‌ కథానాయిక.  మార్చి 28న తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా దీనిపై టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ పృథ్వీరాజ్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌ పెట్టారు.

Prabhas.jpg

"నేను చూస్తుంది వరదరాజ మన్నార్‌గా నటించిన వ్యక్తినా! ఇది నేను నమ్మలేకపోతున్నా. పృథ్వీ మీరు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా. చక్కని విజయం సాధిస్తుంది. మీకు అభినందనలు తెలుపుతున్నా’’ అని ఇన్  స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. దీనికి  పృథ్వీరాజ్‌ రిప్లై ఇచ్చారు. "దేవా.. త్వరలో యుద్థభూమిలో కలుద్దాం’’ అని సమాధానమిచ్చారు.

ప్రస్తుతం పృథ్వీరాజ్‌ సుకుమారన ప్రభాస్‌తో కలిసి 'సలార్‌-2 చిత్రంలోలో నటిస్తున్నారు. ప్రశాంత్  నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.

Updated Date - Mar 10 , 2024 | 02:47 PM