L2 Empuraan: లూసిఫ‌ర్‌2.. అద‌ర‌గొట్టే లుక్‌తో మోహ‌న్ లాల్‌

ABN , Publish Date - May 21 , 2024 | 06:50 PM

2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

L2 Empuraan: లూసిఫ‌ర్‌2.. అద‌ర‌గొట్టే లుక్‌తో మోహ‌న్ లాల్‌
mohanlal

2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ (L2 Empuraan) రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగం హిట్ కావ‌టంతో ఇప్పుడు రానున్న‌ సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నాయి. మోహ‌న్ లాల్ (Mohanlal), వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj sukumaran) కాంబినేష‌న్‌లో రానున్న మూడో చిత్రం కావ‌టంతో అభిమానుల్లో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జ‌యిట్‌మెంట్ ఇప్ప‌టి నుంచే మొద‌లైంది. అంతేగాక‌ స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే నిర్మాణ సంస్థ‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమా ద్వారా తొలిసారి మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది.

మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ (L2 Empuraan) లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఖురేషి పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌టంతో లూసిఫ‌ర్ సినిమా ముగుస్తుంది. ‘L2 ఎంపురాన్’ విష‌యానికి వ‌స్తే ఆ పాత్ర‌ను మ‌రింత విస్తృతంగా ఆవిష్క‌రించ బోతున్నారు. స్టీఫెన్ నెడుంప‌ల్లి అస‌లు ఖురేషి అబ్ర‌మ్‌గా ఎలా మారాడ‌నే విష‌యాన్ని ఇందులో చూపించ‌బోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran), మోహ‌న్‌లాల్ (Mohanlal)కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ హ్యాపీ బ‌ర్త్ డే లాలెట్టా అంటూ ‘L2 ఎంపురాన్’ స్టైలిష్ పోస్ట‌ర్‌ను పృథ్వీరాజ్‌ రిలీజ్ చేశారు.

WhatsApp Image 2024-05-21 at 6.24.09 PM.jpeg


పోస్ట‌ర్‌తో పాటు హృద‌య‌పూర్వ‌క‌మైన అభినంద‌న‌లు తెలియ‌జేస్తూనే విడుద‌ల చేసిన కొత్త పోస్ట‌ర్ లూసిఫ‌ర్ సీక్వెల్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. ‘L2 ఎంపురాన్’ పోస్ట‌ర్‌లో ఖురేషి అబ్ర‌మ్‌గా మోహ‌న్ లాల్ (Mohanlal) సరికొత్తగా క‌నిపిస్తున్నారు. క‌చ్చితంగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj sukumaran) అభిమానుల‌కు, ప్రేక్ష‌క‌ల‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నున్నారనే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న భావోద్వేగానుబంధం కూడా తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఇంకా టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు. లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా ప‌లు చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లనుంది. 2025లో మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ‘L2 ఎంపురాన్’ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ రూ.500 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - May 21 , 2024 | 06:59 PM