40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

The Goat Life: ఒక హీరోకి, ఇంకో హీరో సాయం

ABN, Publish Date - Jan 31 , 2024 | 02:59 PM

మలయాళంలో అగ్ర నటుడైన ప్రిథ్వీరాజ్ సుకుమార్ సినిమా 'ది గోట్ లైఫ్' విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసి ఇప్పటికే చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఇంకో మలయాళం అగ్ర నటుడు దుల్కర్ ఈ సినిమాకి సంబంధించి ఇంకో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

The Goat Life: ఒక హీరోకి, ఇంకో హీరో సాయం
Dulquer Salman and Prithviraj Sukumaran

మలయాళ స్టార్ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

prithvirajsukumargoatlife.jpg

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్, రన్వీర్ సింగ్ రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఈ సినిమా నుంచి ది బిగినింగ్ పోస్టర్ ను ఇంకో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మూవీ టీమ్ కు దుల్కర్ సల్మాన్ తన బెస్ట్ విశెస్ అందించారు. గత రెండు పోస్టర్స్ చూస్తే ఈ బిగినింగ్ పోస్టర్ భిన్నంగా ఉంది. ఇందులో తన సుదీర్ఘ ప్రయాణానికి ముందు సంతోషంగా ఉన్న నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తున్నారు.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.

Updated Date - Jan 31 , 2024 | 02:59 PM