సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

DNA: అధర్వ మురళి ‘DNA’ డబ్బింగ్‌ షురూ

ABN, Publish Date - Jun 26 , 2024 | 10:15 AM

అధర్వ మురళి నిమిషా సజయన్ జంటగా నటించిన చిత్రం ‘డీఎన్‌ఏ’ చిత్రీకరణ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

DNA

అధర్వ మురళి (Atharvaa murali) నిమిషా సజయన్ (Nimisha Sajayan) జంటగా నటించిన చిత్రం ‘డీఎన్‌ఏ’ (DNA) చిత్రీకరణ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ‘ఫర్హానా’, ‘మాన్‌స్టర్‌’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మించిన నెల్సన్‌ వెంకటేశన్ (Nelson Venkatesan) ఈ చిత్రానికి దర్శకుడు. ఒలింపియా మూవీస్ (Olympia Movies) బ్యానరుపై ప్రముఖ నిర్మాత అంబేత్‌ కుమార్ (Ambeth Kumar) నిర్మించారు.


మంచి కథలతో పాటు విభిన్నమైన పాత్రలను ఎంచుకుని తన కెరీర్‌ను కొనసాగిస్తున్న సీనియర్‌ నటుడు దివంగత మురళి తనయుడు అధర్వ మురళి (Atharvaa murali) నటించిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం డబ్బింగ్‌ శరవేగంగా పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు బాలాజీ శక్తివేల్‌, రమేష్‌ తిలక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 04:17 PM