Ajith kumar: టీం వివరణతో ఊపిరి పీల్చుకున్నారు

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:32 PM

ఇటీవల అజిత్ కు సంబంధించిన ఓ స్టంట్స్‌ వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దీనిపై కొందరు అభిమానులు అజిత్‌ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. దీనిపై  టీమ్‌ స్పందించింది.

Ajith kumar: టీం వివరణతో ఊపిరి పీల్చుకున్నారు
Ajith, Trisha

ఇటీవల అజిత్ (Ajith)కు సంబంధించిన ఓ స్టంట్స్‌ వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దీనిపై కొందరు అభిమానులు అజిత్‌ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. దీనిపై  టీమ్‌ స్పందించింది. ‘నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో గతేడాది నవంబర్‌లో తీసినది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. హైవేపై యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేశారు. ఆయన నడిపిన కారు టైరులో గాలి పూర్తిగా తగ్గిపోవడం వల్ల అది అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న అర్నవ్‌(Arnav), అజిత్‌లను మూవీ యూనిట్‌ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. మూడు గంటల్లోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు’’ అని తెలిపింది.  

‘విదా ముయార్చి’లోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం అజిత్‌ రిస్క్‌ చేసి డూప్‌ లేకుండా నటించారు. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసింది. ‘ధైౖర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో..’ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్‌ చేశారు. అది కాస్త వైరల్‌ కావడంతో అజితకు ప్రమాదం జరిగిందనుకుని అభిమానులు కంగారుపడుతూ వరుస పోస్ట్‌లు చేశారు టీమ్‌ వివరణ ఇవ్వడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

Ram Gopal Varma: ఇక నా సినిమాలు నేను చేసుకుంటా... వాటి జోలికి వెళ్ళను 


మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ‘విడాముయర్చి’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతుంది. అందులో అజిత్‌ కారు డ్రైవింగ్‌ చేస్తుండగా, ఆయన పక్క సీటులో నటుడు ఆరవ్‌ గాయాలతో కట్టేసివుండగా, ఓ ఇంటెన్స్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ కారు రోడ్డుపై నుంచి అదుపుతప్పి బోల్తాపడుతుంది. ఆ వెంటనే యూనిట్‌ సభ్యులు పరుగెత్తుకుంటూ వచ్చి కారులోని అజిత్‌, ఆరవ్‌లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ స్టంట్‌ను అజిత్‌, ఆరవ్‌ ఎలాంటి డూప్‌ లేకుండా చేశారు. ఇది గత యేడాది నవంబరులో చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ సన్నివేశం. కాగా, గతంలో తాను నటించిన పలు చిత్రాల్లో కార్‌, బైక్‌ రేసింగ్‌ స్టంట్‌ సన్నివేశాల్లో అనేక రిస్కీ షాట్‌లను కూడా అజిత్‌ ఎలాంటి డూప్‌ లేకుండా నటించిన విషయం తెల్సిందే. ఇపుడు ‘విడాముయర్చి’ కోసం మరోమారు రిస్కీ స్టంట్‌ చేయడంతో ఆయన అభిమానులు ఆందోళనకు చెందుతూ ఇలాంటి రిస్కీ షాట్‌లకు దూరంగా ఉండగాలని విఙ్ఞప్తి చేస్తున్నారు. కాగా, అజర్‌బైజాన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్రిష, అర్జున్‌ నటిస్తున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 04:47 PM