Maharaja OTT: ఓటీటీకి వ‌చ్చేస్తున్న విజ‌య్ సేతుప‌తి లేటెస్ట్ థ్రిల్ల‌ర్‌! ఎప్ప‌టి నుంచంటే?

ABN , Publish Date - Jun 26 , 2024 | 11:17 AM

ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు విజ‌య్ సేతుప‌తి లేటెస్ట్ త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్‌ సినిమా మ‌హారాజా సిద్ద‌మ‌వుతోంది. జూన్ 14న‌ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

Maharaja

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi) లేటెస్ట్ త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్‌ సినిమా మ‌హారాజా (Maharaja) సిద్ద‌మ‌వుతోంది. ఇటీవ‌లే జూన్ 14న‌ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, .హిందీ భాష‌ల్లో థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రూ.20 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌ను సాధించి విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi) కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డం విశేషం.

Maharaja.jpg

క‌థ విష‌యానికి వ‌స్తే.. మ‌హారాజా, ఆయ‌న కూతురు ఎంతో ఇష్టంగా చూసుకునే ల‌క్ష్మి అనే డ‌స్ట్ బిన్‌ను ఎవ‌రో దొంగ‌లించార‌ని వెతికి పెట్టాలంటు పోలీస్ స్టేష‌న్‌కు వెళ‌తాడు. అక్క‌డ వారు హేళ‌న చేయ‌డంతో ఎంత ఖ‌ర్చైనా భ‌రిస్తాన‌ని నా ల‌క్ష్మిని వెతికి పెట్టించాలంటూ ప్రాధేయ ప‌డ‌తాడు.. అక్క‌డున్న పోలీసులంద‌రికి సేవ‌లు కూడా చేస్తుంటాడు. మ‌రో వైపు సెల్వం అనే గ‌జ దొంగ త‌న భార్య‌, కూతురితో క‌లిసి హ్యాపీ లైప్‌ లీడ్ చేస్తుంటాడు. ఉద‌యం ఎల‌క్ట్రానిక్ షాపులో పని చేస్తూ రాత్రిళ్లు మ‌రో ఇద్ద‌రి సాయంతో ఊరి బ‌య‌ట‌ ఇండ్లలోకి చొర‌బ‌డి దోపీడీలు, హ‌త్య‌లు చేస్తు ఉంటాడు.


ఇలా సినిమాలో రెండు క‌థ‌లు న‌డుస్తూ ప్రేక్ష‌కుల‌కు స‌మ్‌థింగ్ ఏదో జ‌ర‌గ‌బోతుంద‌నే విష‌యాన్ని చివ‌రి వ‌ర‌కు సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెడుతుంది. అస‌లు మ‌హారాజాకు సెల్వంకు మ‌ధ్య ఏమైనా సంబంధం ఉందా, పోలీసులు ల‌క్ష్మిని వెతికి తేగ‌లిగారా, దాని వెన‌కాల ఇంకేమెనా ర‌హాస్యాన్ని క‌నిపెట్టారా అనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో ఫ‌స్టాప్ అంతా కామెడీగా సాగుతుంది. ఇంట‌ర్వెల్ మంచి క‌థ‌ ట‌ర్న్ తీసుకుని సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచేస్తుంది. ఇక ఆ త‌ర్వాత ఒక్కోక్క చిక్కును విప్పుకుంటూ ఎక్క‌డా థ్రిల్ మిస్స‌వ‌కుండా స‌స్పెన్స్‌ను కంటిన్యూ చేశారు. ఇక ఫ్రీ క్లైమాక్స్‌లో పోలీసులు ఇచ్చే ట్విస్టు, క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్టుతో మైండ్ బ్లాక్ అవ‌డం మాత్రం ఖాయం.

maharaja

ఇప్పుడీ మ‌హారాజా (Maharaja) సినిమాను ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు. జూలై 19 నుంచి త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. అరుదుగా వ‌చ్చే ఇలాంటి థ్రిల్ల‌ర్ సినిమాను ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఓటీటీలో మాత్రం మిస్ చేయ‌కండి. నిథిల‌న్ స్వామినాథ‌న్ (Nithilan Swaminathan) ఈ సినిమాకు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చేయ‌గా మ‌మ‌తా మోహ‌న్ దాస్ (Mamta Mohandas), అభిరామి (Abhirami), బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ (Anurag Kashyap), న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్యం (Natarajan Subramaniam) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Updated Date - Jul 08 , 2024 | 12:58 PM