Aarambham OTT: మ‌రో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన.. తెలుగు టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్‌! డోంట్‌మిస్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:15 PM

రెండు నెల‌ల క్రితం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో ఫీల్‌గుఢ్ మూవీగా పేరు తెచ్చుకున్న‌ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ చిత్రం ఆరంభం తాజాగా మ‌రో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

Aarambham OTT

రెండు నెల‌ల క్రితం మే10 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో ఫీల్‌గుఢ్ మూవీగా పేరు తెచ్చుకున్న‌ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ చిత్రం ఆరంభం (Aarambham) తాజాగా మ‌రో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. ఎల‌క్ష‌న్స్‌, ఐపీఎల్ వ‌ళ్ల పూర్తిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోయిన ఈ సినిమాలో కేరాఫ్ కంచ‌ర‌పాలెం చిత్రం ఫేం మోహ‌న్ భ‌గ‌త్ (Mohan Bhagat) హీరోగా న‌టించ‌గా, భూష‌ణ్‌, అభిషేక్‌, ర‌వీంద్ర‌ విజ‌య్ (Ravindra Vijay), సుప్రీత‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అజ‌య్‌నాగ్ (Ajay Nag) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సింజిత్ ఎర్ర‌మిల్లి (SinjithYerramilli) సంగీతం అందించారు.

తెలుగులో రేర్‌గా వ‌చ్చే టైమ్ ట్రావెల్‌, టైమ్ లూప్ క‌థాంశంతో వ‌చ్చిన ఈ ఆరంభం (Aarambham) చిత్రం ఓ నాలుగైదు పాత్ర‌ల చుట్టే తిరుగ‌తూ చూసే ప్రేక్ష‌కుల‌ను సినిమాలో లీన‌మ‌య్యేలా చేస్తుంది. టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్ కి మునుపెన్నడూ లేని అనుభూతిని త‌ప్ప‌క ఇస్తుంది.

Aarambham

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. మిగిల్ (మోహ‌న్ భ‌గ‌త్) ఓ హ‌త్య కేసులో ఉరిశిక్ష ప‌డి కాలాఘటి జైలుకు వెళ‌తాడు. తెల్లారితే ఉరి తీస్తార‌నే స‌మ‌యానికి మిగిల్ (మోహ‌న్ భ‌గ‌త్) ఎటువంటి ఆధారాలు లేకుండా జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. అత‌ను ఉన్న గ‌దికి వేసిన తాళాలు వేసిన‌ట్టే ఉండ‌డం, గోడ‌ దూకిన‌ అన‌వాళ్లు ఏవీ లేక‌పోవ‌డంతో ఈ కేసు మిస్ట‌రీగా మారుతుంది.


Aarambham

ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురి చేస్తుంది. దీంతో ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్‌లు వస్తారు. వారి పరిశోధనలో ఈ క్ర‌మంలో జైలులో మిగిల్ డైరీ దొర‌క‌డంతో పాటు, ఆశ్చర్య పరిచే అంశాలు వెలుగులోకి వస్తాయి. హీరో కాలంలో ఎందుకు వెన‌క్కి వెళ్లాల్సి వ‌చ్చింది.. ఓ ప్రోపెస‌ర్ చేసిన ఈ ప్ర‌యోగంలో ఎందుకు పాల్గొని ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు, చివ‌ర‌కు హీరో ఎమ‌య్యాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంటుంది.

Aarambham

కాకపోతే టైమ్ లూప్ కాన్సెప్ట్ కావ‌డంతో చూసిన సీన్లే చూసిన‌ట్లు అనిపించి క‌న్ప్యూజ‌న్ అవ్వోచ్చు . అది త‌ప్పితే సినిమా అంతా ఎమోష‌న‌ల్, థ్రిల్ల‌ర్‌గా సాగుతూ మ‌నల్ని వారితో క‌లిసి జ‌ర్నీ చేసే ఫీల్ ఇస్తుంది. ఈ సినిమా ఇప్ప‌టికే ఈ టీవి విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోండ‌గా తాజాగా ఈ రోజు (శుక్ర‌వారం,జూలై 5) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, ఈ టీవీ విన్‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఆరంభం (Aarambham) చిత్రాన్ని కుటుంబ స‌మేతంగా చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్‌.

Updated Date - Jul 05 , 2024 | 12:58 PM