Star OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి.. తెలుగులోనూ వ‌చ్చిన త‌మిళ హిట్‌ ఎమోష‌న‌ల్ డ్రామా

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:27 PM

త‌మిళ యువ‌ న‌టుడు కెవిన్ హీరోగా న‌టించిన ఓ చిత్రం ఉన్న‌ట్టుండి తెలుగులోనూ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి స‌ర్‌ఫ్రైజ్ చేసింది. గ‌త నెల 10న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది.

Star OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి.. తెలుగులోనూ వ‌చ్చిన త‌మిళ హిట్‌ ఎమోష‌న‌ల్ డ్రామా
star

ఓ త‌మిళ చిత్రం ఉన్న‌ట్టుండి తెలుగులోనూ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి స‌ర్‌ఫ్రైజ్ చేసింది. త‌మిళ యువ‌ న‌టుడు కెవిన్ (Kavin) హీరోగా ప్ర‌ముఖ తెలుగు నిర్మాణ‌ సంస్థ శ్రీ వేంక‌టేశ్వ‌ర సినీ చిత్ర (Sri Venkateswara Cine Chitra)మ‌రో త‌మిళ సంస్థ‌తో క‌లిసి నిర్మించిన చిత్రం స్టార్ (Star). గ‌త నెల 10న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. సీరియ‌ల్స్ నుంచి సినిమాల్లోకి వ‌చ్చిన కెవిన్ 2023 ప్రారంభంలో వ‌చ్చిన‌ దాదా సినిమాతో హీరోగా ఓవ‌ర్‌నైట్‌ స్టార్‌గా మారి త‌మిళ‌నాడు వ్యాప్తంగా యూత్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నాడు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ‌డంతో ఎన్నో అంచ‌నాల న‌డుమ ఈ స్టార్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ తెచ్చుకుంది. న్యూ సెన్షేష‌న్స్ ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan), అదితి పోన్‌క‌ర్ (Aaditi Pohankar) క‌థానాయికులుగా న‌టించ‌గా ఎలాన్ (Elan)త‌ర్వ‌క‌త్వం చేశారు.

maxresdefault.jpg

ఇక ఈ చిత్రం క‌థ విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన పాండియ‌న్ ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. త‌న కుమారుడు కాళిని ఎలాగైనా సినిమా హీరో చేయాల‌ని కొడుకుకు చిన్న‌ప్ప‌టినుంచే న‌ట‌న‌తో త‌ర్ఫీదు ఇచ్చి సినిమాకు సంబంధించిన అంశాల‌ను చెబుతూ హీరో లుక్స్ ఉండేలా పెంచుతాడు. ఆపై ఇంట‌ర్ పూర్తి చేసిన కాళి ఇంటి అర్థిక స‌మ‌స్యల నిమిత్తం సినిమా ఛాన్సుల కోసం వేట మొద‌లు పెడ‌తాడు. ఈక్ర‌మంలో ముంబైలో ఫిలిం ఇనిస్ట్యూట్‌లోనూ చేరి శిక్ష‌ణ పూర్తి చేసుకుని చెన్నైకి వ‌చ్చాక హీరో ఛాన్స్ వ‌స్తుంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో కాళికి యాక్సిడెంట్‌ అయి మోహంపై తీవ్ర గాయాల‌వుతాయి.


దీంతో సినిమా అవ‌కాశం పోయి త‌న జీవితం మ‌ళ్లీ మెద‌టికి వ‌స్తుంది. అంతేగాక‌ మొహంపై భారీ గాయాలు కావ‌డంతో ఇక సినిమాల‌కు ప‌నికి రాను అంటూ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురై అదే మూడ్‌లో ఉంటుంటాడు. దీంతో అత‌ని ప్రేయ‌సి కూడా వెళ్లిపోతుంది. ఆ త‌ర్వాత మ‌రో యువ‌తి అత‌ని జీవితంలోకి రావ‌డం,పెళ్లి చ‌క‌చ‌కా అయిపోతాయి. ఈ క్ర‌మంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవితం వెళ్ల‌దీస్తుంటాడు. ఇంత‌లో త‌న అఫీసులో ఓ యాడ్ ఫిలిం షూటింగ్ జ‌ర‌గ‌డం అక్క‌డ‌ జ‌రిగిన ఓ ఇష్యూతో సినిమా న‌టుడుని కావాల‌ని మ‌ళ్లీ నిర్ణ‌యించుకుంటాడు.

kavin_startrailer_270424_5.jpg

ఈ నేపథ్యంలో కాళి చివ‌ర‌కు న‌టుడ‌య్యాడా, త‌న ఫ్యామిలీ ఏం చేసింది, భార్య‌ను ఏం చేశాడు, తండ్రి కోరిక‌, త‌న ల‌క్ష్యాన్ని సాధించాడా అనే అస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాతో సినిమా ఆక‌ట్టుకుంటుంది. సినిమా ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో సాగుతూ మంచి స్ట్రాంగ్‌ మెసేజ్ కూడా ఇస్తుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో త‌మిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హీరో క్యారెక్ట‌రైజేస‌న్‌తో సినిమా కాస్త లాగ్ అనిపించ‌డం, హీరో అవుదామ‌నుకున్నా ప్ర‌తీసారి ఏదో ఒక అడ్డంకి రావ‌డం సినిమాను సాగ‌తీసిన‌ట్లు అనిపిస్తోంది. అది మిన‌హా ఈ మూవీని కుటుంబంతో క‌లిసి హాయిగా చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Jun 09 , 2024 | 04:27 PM