మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Teacher: 90s టీమ్ నుంచి కొత్త వెబ్ సిరీస్ ‘టీచ‌ర్‌’.. ఈ వేస‌విలో న‌వ్వుల్లో మున‌గాల్సిందే

ABN, Publish Date - Apr 17 , 2024 | 05:09 PM

ఇటీవ‌ల ఓటీటీలో విప‌రీత‌మైన వ్యూస్ ద‌క్కించుకున్న వెబ్ సిరీస్ 90s. ఇప్పుడు అదే టీం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

swathi teacher

ఇటీవ‌ల ఓటీటీలో విప‌రీత‌మైన వ్యూస్ ద‌క్కించుకున్న వెబ్ సిరీస్ 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్ (90s). ఇప్పుడు అదే టీం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో, ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లులతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సిరీస్ కు కూడా ఆదిత్య హసన్ (AdityaHasan) దర్శకత్వం వహిస్తోండగా నవీన్‌ మేడారం (Naveen Medaram ) నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్) (MNOPRODUCTIONS) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది.

తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోండగా. టీచర్‌గా కలర్స్ స్వాతి (Swathi) నటిస్తోంది. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉండనుంది.


సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం.. ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో సందేహం లేదు.

ఇందులో కలర్స్ స్వాతితో పాటు నిఖిల్‌ దేవాదుల (బాహుబలి ఫేమ్‌), నిత్యశ్రీ (కేరాఫ్‌ కంచరపాళెం ఫేమ్‌), రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ (90స్‌ ఫేమ్‌), హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 05:09 PM