OTT: బావ భార్య‌.. మాజీ ప్రేయ‌సి అయితే! ఓటీటీలోకి అదిరిపోయే ఫ్యామిలీ, కామెడీ డ్రామా

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:30 PM

మాలీవుడ్ సూప‌ర్‌ స్టార్ ఫృథ్వీరాజ్ సుకుమార‌న్, బ‌సిల్ జోసెఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రీసెంట్ హిట్ మ‌ల‌యాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం గురువాయూర్ అంబలనాదయిల్ ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది.

OTT: బావ భార్య‌.. మాజీ ప్రేయ‌సి అయితే! ఓటీటీలోకి అదిరిపోయే ఫ్యామిలీ, కామెడీ డ్రామా
Guruvayoor Ambalanadayil

మాలీవుడ్ సూప‌ర్‌ స్టార్ ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran), బ‌సిల్ జోసెఫ్ (Basil Joseph), నిఖిలా విమ‌ల్ (Nikhila Vimal), అన‌శ్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన గురువాయూర్ అంబలనాదయిల్ (Guruvayoor Ambalanadayil) అనే ఓ మ‌ల‌యాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది. గ‌త నెల మే 16న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లతో మంచి విజ‌యం సాధించింది.అంతేకాదు ఈ యేడు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన వాటిల్లో ఐదో మ‌ల‌యాళ‌ చిత్రంగా, హ‌య్యెస్ట్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఆల్‌టైం 8వ‌ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. గ‌తంలో అంత్యాక్ష‌రి, జ‌య జ‌య జ‌య జ‌య‌హే చిత్రాలను రూపొందించిన‌ విపిన్ దాస్ (Vipin Das) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. E4 ఎట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ఫృథ్వీరాజ్ ప్రోడ‌క్ష‌న్స్ ( Prithviraj Productions) బ్యాన‌ర్‌పై ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ నిర్మించారు.

GN9xMkcXYAAQf1R.jpeg

ఇక ఈ సినిమా క‌థ విషయానికి వ‌స్తే.. దుబాయ్‌లో ఉద్యోగం చేసే విను రామ‌చంద్ర‌న్ బ‌సిల్ జోసెఫ్ (Basil Joseph)కు కేర‌ళలో నివ‌సించే అనంద‌న్ ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran) చెల్లి అంజ‌లి (Anaswara Rajan)తో పెళ్లి కుదురుతుంది. అయితే అప్ప‌టికే ఐదేండ్ల క్రితం పార్వ‌తితో జ‌రిగిన‌ బ్రేక‌ప్ వినును బాగా వెంటాడుతుండ‌డంతో కాబోయే బావ అనంద‌న్ సాయంతో కాస్త రిలాక్స్ అవుతాడు. అయితే పెళ్లి వేడుక‌లు మొద‌లైన స‌మ‌యంలో మొద‌టిసారి ఆనంద‌న్‌, విను క‌లుసుకుంటారు. అప్పుడే త‌న ఆనంద‌న్ భార్య ఎక్స్ ల‌వ‌ర్ పార్వ‌తి నిఖిలా విమ‌ల్ (Nikhila Vimal) అని తెల‌సుకుని విను షాక్ అవుతాడు. ఈ క్ర‌మంలో మొద‌ట్లో విను ఎలాగైనా పెళ్లిని క్యాన్స‌ల్ చేయాల‌ని స్నేహితులతో క‌లిసి ప్ర‌య‌త్నాలు చేయ‌డం, విష‌యం తెలిసిన కాబోయే భార్య అంజ‌లి మ‌ద్ద‌తుతో పెళ్లికి సిద్ద‌మ‌వ‌డం జ‌రుగుతాయి.


తిరిగి అదే స‌మ‌యంలో ఆనంద‌న్‌కు వాస్త‌వం తెలిసి బంధువుల సాయంతో ఆ పెళ్లిని క్యాన్స‌ల్ చేయ‌డం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తాడు. చివ‌ర‌కు ఈ స‌మస్య‌ తీరిందా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల మ‌ధ్య సినిమా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తూ చివ‌రివ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ప్ర‌తీ స‌న్నివేశం కామెడీని పంచుతూ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది.

GEBjGDYXcAAkIM3.jpeg

ఇప్పుడీ సినిమా గురువాయూర్ అంబలనాదయిల్ (Guruvayoor Ambalanadayil) జూన్ 27 నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) లో స్ట్రీమింగ్‌కు రానుంది. మాతృక మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ బాష‌ల్లోనూ అందుబాటులో ఉండ‌నుంది. సో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌, ఇబ్బందిక‌ర స‌న్నివేశాలు లేని ఈ చిత్రాన్ని ఈ వీకెండ్ మీ కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి. డోంట్ మిస్‌.

Updated Date - Jun 25 , 2024 | 01:03 PM