Dubbing Movies: ఓటీటీల్లో తెలుగు డ‌బ్బింగ్ సినిమాల‌ దండ‌యాత్ర.. చూసినోళ్ల‌కు చూసిన‌న్ని

ABN , Publish Date - Jan 25 , 2024 | 05:47 PM

ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు స‌రిప‌డా వినోదం అంద‌నుంది. ఈ వీకెండ్ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఓ డ‌జ‌న్‌కు పైగానే సినిమాలు,వెబ్ సిరీస్‌లు తెలుగు ప్రేక్ష‌కులను అల‌రించ‌నున్నాయి.

Dubbing Movies: ఓటీటీల్లో తెలుగు డ‌బ్బింగ్ సినిమాల‌ దండ‌యాత్ర.. చూసినోళ్ల‌కు చూసిన‌న్ని
Dubbing Movies

ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు స‌రిప‌డా వినోదం అంద‌నుంది. ఈ వీకెండ్ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఓ డ‌జ‌న్‌కు పైగా సినిమాలు,వెబ్ సిరీస్‌లు తెలుగు ప్రేక్ష‌కులను అల‌రించ‌నున్నాయి. వీటిలో హాలీవుడ్‌తో పాటు కొరియ‌న్‌, బాలీవుడ్‌, త‌మిళ‌, మ‌ళ‌యాళంల నుంచి వ‌చ్చిన‌వి ఉన్నాయి. అవేంటో ఏయే ఓటీటీ ఫ్లాట్ ఫాంల‌లో వ‌స్తున్నాయో చెక్ చేసుకోండి ,ఈ వారంతంలో చూసి ఎంజాయ్ చేయండి.

Netflix

Animal: (యానిమ‌ల్‌): ర‌ణ‌బీర్ క‌పూర్, ర‌ష్మిక న‌టించిన ఈ బాలీవుడ్ చిత్రం జ‌న‌వ‌రి 26 నుంచి హిందీతో పాటు, తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది. ఇది పెద్ద‌లకు మాత్ర‌మే

Badland Hunters:(బ్యాడ్‌ల్యాండ్‌ హంటర్స్‌): డాంగ్ లీ న‌టించిన ఈ కొరియన్‌ డిస్టోపియన్ యాక్షన్ చిత్రం జనవరి 26 నుంచి స్ట్రెయిట్‌గా నెట్ ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది.

Griselda: గ్రిసెల్డా అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ బ‌యోగ్ర‌ఫీగా వ‌స్తున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ (Netflix Original Biography Crime Thriller Series)లో 6 ఎపిసోడ్స్‌ ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

Avatar The Last Air bender: అవ‌తార్ ది లాస్ట్ ఎయిర్‌బెండ‌ర్ అనే లైవ్ యాక్ష‌న్, అడ్వెంచ‌ర్‌, ఫాంట‌సీ వెబ్ సిరీస్ (Netflix Original LiveAction Adventure Fantasy Series) ఫిబ్ర‌వ‌రి 22 నుంచి తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Mea Culpa (2024): మీ కల్పా అనే క్రైమ్, మిస్ట‌రీ, థ్రిల్ల‌ర్ సినిమా (Crime Mystery Thriller Film) ఫిబ్ర‌వ‌రి 23 నుంచి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ళ్లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

PrimeVideoIN

Reacher Season 2: రీచ‌ర్ అనే హాలీవుడ్‌ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ (Action Crime Thriller Series) సీజ‌న్ 2లో ని 8 ఎపిసోడ్స్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

High School: హైస్కూల్ అనే అమెరిక‌న్ డ్రామా వెబ్ సిరీస్‌(American Amazon Original Drama Series )లోని 8 ఎపిసోడ్స్ ప్ర‌స్తుతం అమెజాన్ మిని టీవీ(Amazon mini TV)లో తెలుగు, హిందీ, త‌మిళ లాంగ్వేజెస్‌లో ఫ్రీగా ప్ర‌సారం అవుతున్న‌ది.

Road house: రోడ్ హౌజ్ అనే అమెజాన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెలుగుతో పాటు మిగ‌తా భాష‌ల్లో మార్చి 21 నుంచి స్ఠ్రీమింగ్ కానుంది.

Invincible S2 (Part 2): ఇన్విన్సిబుల్ అనే యానిమేటెడ్ సిరీస్‌లో 4 ఎపిసోడ్స్‌ మార్చి 14 నుంచి తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది.


Disney+ Hotstar

Neru: మోహ‌న్‌ లాల్ న‌టించిన మ‌ల‌యాళ డ‌బ్బింగ్ చిత్రం నేరు ప్ర‌స్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

Fight Club: ఫైట్‌క్ల‌బ్ అనే త‌మిళ డ‌బ్బింగ్ చిత్రం జ‌న‌వ‌రి (January) 27 నుంచి తెలుగులోను స్ట్రీమింగ్ అవ‌నుంది.

The Marvels: ది మార్వెల్స్ అనే లేటెస్ట్ హాలీవుడ్ సినిమా ఫిభ్ర‌వ‌రి 7 నుంచి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Crunchyroll

Vinland Saga: విన్‌లాండ్ సాగ, Demon Slayer (డెమాన్ స్లేయార్) అనే రెండు జ‌ప‌నీస్ యానిమేటెడ్ సిరీస్‌లు సీజ‌న్ 1 అండ్ 2 ప్ర‌స్తుతం క్రంచీ రోల్ ఓటీటీలో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

Solo Leveling: సోలో లెవ‌లింగ్ అనే లేటెస్ట్ జ‌ప‌సీప్‌యానిమేటెడ్ యాక్ష‌న్‌,ఫాంట‌సీ, థ్రిల్ల‌ర్ సిరీస్ (Japanese Action Fantasy Thriller Anime Series)లో ఎపిసోడ్ 1 ప్ర‌స్తుతం క్రంచీ రోల్ ఓటీటీలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది.

(E tv WIn)

Little Miss Naina: లిటిల్ మిస్ నైనా అనే మ‌ళ‌యాళ డ‌బ్బింగ్ చిత్రం ప్ర‌స్తుతం ఈటీవీ విన్ లో తెలుగులో ప్ర‌సారం అవుతోంది.

Param Porul: ప‌రంపోరుల్ అనే త‌మిళ డ‌బ్బింగ్ చిత్రం ఫిభ్ర‌వ‌రి 1 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Aqua Man 2: ఆక్వామెన్‌2: హ‌లీవుడ్ భారీ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం బుక్ మై షో ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో రెంట్ ప‌ద్ద‌తిలో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

The Communion Girl: ది క‌మ్యూన్ గ‌ర్ల్ అనేఅమెరిక‌న్ హుక్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ (American Hook Mystery Thriller) ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ హిందీ భాష‌ల్లో వీఆర్ ఓటీటీ (VR OTT), బుక్ మై షో (BmsStream )ల్లో రెంట్ ప‌ద్ద‌తిలో స్ట్రీమింగ్ అవుతోంది.

AkashVaani: ఆకాశ‌వాణి అనే త‌మిళ వెబ్ సిరీస్ జ‌న‌వ‌రి (January) 26 నువంచి తెలుగులో ఆహలో ప్ర‌సారం కానుంది.

వీటితో పాటు ఆథ‌ర్వ అనే తెలుగు స్ట్రెయిట్ తెలుగు చిత్రం ప్ర‌స్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

Updated Date - Jan 25 , 2024 | 05:59 PM