మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sundaram Master: సుంద‌రం మాష్టార్‌ ఓటీటీకి వ‌స్తున్నారు.. మీరు రెడీనా!

ABN, Publish Date - Mar 25 , 2024 | 09:16 AM

గ‌త నెల‌ చివ‌రి వారంలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన కామెడీ చిత్రం సుంద‌రం మాస్ట‌ర్. క‌మెడియ‌న్ హ‌ర్ష చెముడుని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హీరో ర‌వితేజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

sundaram master

గ‌త నెల‌ చివ‌రి వారంలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన కామెడీ చిత్రం సుంద‌రం మాస్ట‌ర్ (Sundaram Master). క‌మెడియ‌న్ హ‌ర్ష చెముడు (harsha chemudu)ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హీరో ర‌వితేజ (Ravi Teja) త‌న ఆర్టీ టీమ్ వ‌ర్క్స్ (RT Team Works) బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించ‌గా క‌ళ్యాణ్ సంతోష్ (Kalyan Santhosh) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దివ్య శ్రీపాద క‌థానాయిక‌గా చేసింది. ఇప్పుడు ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు గ‌ట్టిగానే చేసి హ‌డావుడి చేసిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ను మాత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది. గ‌త వార‌మే ఈ సినిమా ఓటీటీలోకి తీసుకు వ‌స్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకుని ఈ వారం స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు. మార్చి 28 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా (Aha)లో విడ‌ద‌ల కానుంది.


మారుమూల అడ‌విలో ఉన్న ఓ నిధిని క‌నిపెట్టేందుకు గాను ఓ ప్ర‌జాప్ర‌తినిధి సూచ‌న‌తో హీరో అఅడ‌వికి వెళ‌తాడు. అదివాసీల‌కు ఇంగ్లీష్ నేర్పించే టీచ‌ర్‌గా అక్క‌డ అడుగు పెట్టిన త‌ర్వాత అత‌నికి ఎలాంటి ఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి, అడ‌వి మ‌న‌షుల‌కు ఇంగ్లీష్ నేర్పించాడా, నిధిని క‌నిపెట్టాడా అనే ఆస‌క్తిక‌ర‌మైన కథ‌క‌థ‌నాల‌తో, వినోద‌భ‌రితంగా తెర‌కెక్కించారు. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయండిక‌.

Updated Date - Mar 25 , 2024 | 09:16 AM