Ott: ఓటీటీలోకి వ‌చ్చిన‌.. రొమాంటిక్‌, కామెడీ చిత్రం! స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

ABN , Publish Date - Jan 25 , 2024 | 07:00 PM

మ‌రో అనువాద చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అయితే ఇది ఓ పెద్ద స్టార్ న‌టించిందో, క్రైమ్‌, థ్రిల్ల‌ర్ చిత్ర‌మో కాదు. పొట్టి, పొడుగు అనే విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ల‌వ్ స్టోరి.

Ott: ఓటీటీలోకి వ‌చ్చిన‌.. రొమాంటిక్‌, కామెడీ చిత్రం! స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?
little miss naina

మ‌రో అనువాద చిత్రం ‘లిటిల్ మిస్ నైనా’(Little Miss Naina) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అయితే ఈది ఓ పెద్ద స్టార్ న‌టించిందో, క్రైమ్‌,థ్రిల్ల‌ర్ చిత్ర‌మో కాదు. పొట్టి, పొడుగు అనే విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ల‌వ్ స్టోరి. తమిళంలో 96 (తెలుగులో జాను) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో జాన‌కి అనే స్కూల్ అమ్మాయిగా కనిపించి, నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకున్నారు గౌరీ కిషన్ (Gouri G Kishan) ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

తెలుగులో సంతోష్ శోభ‌న్‌తో క‌లిసి శ్రీదేవి శోభ‌న్ బాబు అనే స్టెయిట్ చిత్రంలో న‌టించిన ఈ అమ్మ‌డు ఈ త‌ర్వాత‌ తమిళ‌, మ‌ళ‌యాళ చిత్రాల‌తో చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా చేసిన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం లిటిల్ మిస్ నైనా (Little Miss Naina). గ‌త సంవ‌త్స‌రం ఆక్టోబ‌ర్‌లో విడుద‌లైన ఈ మ‌ల‌యాళ‌ చిత్రం అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. షేర్షా షెరీఫ్ (Shersha Sherief) మెయిన్ లీడ్‌గా నటించగా, నూతన దర్శకుడు విష్ణు దేవ్ దర్శకత్వం వహించారు. ETV విన్‌లోకి వచ్చింది. పొట్టి, పొడుగు అనే ఓ ప్రత్యేకమైన కథాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కింది.


పొడవుగా (6 అడుగులు) ఉండే అభిజిత్ కి సినిమా అంటే పెద్ద ప్యాషన్, అదేవిధంగా OCD సమస్యతో పొట్టిగా (4 అడుగులు) ఉండే నైనాకు చదువులంటే ప్రాణం. ఈ క్ర‌మంలో వీరిద్దరి మధ్య ప్రేమ కథ ఎలా సాగింది? ఏం సమస్యలు వ‌చ్చాయ్‌? అనే క‌థాంశంతో వినోదభరితంగా చూపించారు. 96 ఫేమ్ గోవింద్ వసంత (Govind Vasantha) అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ల్యూక్ జోస్ కెమెరా, సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్, సుతిన్ సుగతన్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా ఈ రోజు( జనవరి 25) నుంచి ETV విన్ ఓటీటీలో ప్రసారం అవుతుంది. అక్క‌డ‌క్క‌డ ఒక‌టి రెండు లిప్‌లాక్ స‌న్నివేశాల మిన‌హా సినిమాను హ్యాపీగా చూసేయొచ్చు.

Updated Date - Jan 25 , 2024 | 07:00 PM