OTT: పద్ధతైన దాడి స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 10:01 AM

రవితేజ (Ravi teja)హీరోగా, కావ్యా థాపర్‌, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle) ఓటీటీలో(OTT) స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

OTT: పద్ధతైన దాడి స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

రవితేజ (Ravi teja)హీరోగా, కావ్యా థాపర్‌, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle) ఓటీటీలో(OTT) స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే! బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. రవితేజ మెస్మరైజింగ్‌ నటన కనబర్చారు. 

ఇప్పటి దాకా థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. త్వరలో  స్ట్రీమింగ్   చేస్తామని అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon) వీడియోను అధికారికంగా ప్రకటించింది. అయితే విడుదల తేదీని ప్రకటించలేదు. మార్చి 2వ తేదీన ఈగల్‌  స్ట్రీమింగ్   ఖాయమని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. లేదా మార్చి 8వ తేదీన కూడా  స్ట్రీమింగ్  అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. విడుదల తేదీపై అమెజాన్  ప్రైమ్‌(Prime video_ ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Updated Date - Feb 27 , 2024 | 10:01 AM