OTT: ఈ రోజు ఓటీటీలోకి వ‌చ్చిన డ‌బ్బింగ్‌, స్ట్రెయిట్ సినిమాలివే

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:58 PM

ఎప్ప‌టిలానే ఈవారం కూడా ఓటీటీలో స్ట్రైయిట్ చిత్రాల‌తో పోటీగా డ‌బ్బింగ్ చిత్రాలు విడుద‌లయ్యాయి. వీటిలో చాలా వ‌ర‌కు పెద్ద చిత్రాలే కావ‌డం గ‌మ‌నార్హం. అవేంటో ,ఎందులో రానున్నాయో చూసి మీ స‌మ‌యాన్ని బ‌ట్టి వీక్షించండి.

OTT: ఈ రోజు ఓటీటీలోకి వ‌చ్చిన డ‌బ్బింగ్‌, స్ట్రెయిట్ సినిమాలివే
OTT

ఎప్ప‌టిలానే ఈవారం కూడా ఓటీటీలో స్ట్రైయిట్ చిత్రాల‌తో పోటీగా డ‌బ్బింగ్ చిత్రాలు విడుద‌లయ్యాయి. వీటిలో చాలా వ‌ర‌కు పెద్ద చిత్రాలే కావ‌డం గ‌మ‌నార్హం. అవేంటో ,ఎందులో రానున్నాయో చూసి మీ స‌మ‌యాన్ని బ‌ట్టి వీక్షించండి.

Netflix

GunturKaaram

మ‌హేశ్‌బాబు, శ్రీలీల న‌టించిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram) ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Bhakshak

భూమి ప‌డ్నేక‌ర్ న‌టించిన హిందీ చిత్రం భ‌క్ష‌క్ (Bhakshak ) ఈ రోజు నుంచి తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Ayalaan

శివ కార్తికేయ‌న్ న‌టించిన త‌మిళ చిత్రం అయ‌లాన్ సంక్రాంతికి విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. తెలుగులో థియేట‌ర్ల‌లో విడుదల వాయిదా ప‌డ్డ ఈ చిత్రం ఇక ఓటీటీలోనే స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ఈ రోజు (శుక్ర‌వారం) త‌మిళ వెర్ష‌న్ స‌న్ నెక్స్ట్‌లో విడుద‌ల‌వ‌గా మ‌రో వారం త‌ర్వాత తెలుగులో రానుంది. 16 నుంచి ప్రైమ్ వీడియోలోను రిలీజ్ కానుంది.

PrimeVideoIN

Joruga husharuga

(జోరుగా హుషారుగా) బేబీ సినిమా సెకండ్ హీరో విరాజ్ అశ్విన్ న‌టించిన ఈ తెలుగు స్ట్రెయిట్ చిత్రం ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

CaptainMiller

(కెప్టెన్ మిల్ల‌ర్‌) ధ‌నుష్ న‌టించిన ఈ చిత్రం సంక్రాంతికి త‌మిళ‌నాట విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. తెలుగులో రెండు వారాల క్రితం విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ లేక డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీఇయోలో త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Kannagi

క‌న్న‌గి ( కీర్తి పాండియన్, అమ్ము అభిరామి, విద్యా ప్రదీప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం గ‌త సంవ‌త్స‌రం త‌మిళంలో విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగులోను స్ట్రీమింగ్ అవ‌తున్న‌ది.

MrAndMrsSmith (2024)

మిస్ట‌ర్ అండ్ మిసెస్ స్మిత్ (Mr And Mrs Smith (2024) అనే స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సిరీస్ (Amazon Original Spy Action Thriller Series) లో 8 భాగాలు ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

20th Century Boy And Girl

20th సెంచురీ బాయ్ అండ్ గ‌ర్ల్ అనే కొరియ‌న్ సిరీస్ (Korean Series) సీజ‌న్ 1 ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video), అమెజాన్ మినీ టీవీ (Amazon miniTV )ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.


Disney+ Hotstar

The Marvels

ది మార్వ‌ల్స్ అనే హాలీవుడ్ చిత్రం ప్ర‌స్తుతం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

Aquaman 2 And The Lost Kingdom

అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ‌డ‌మ్ అనే హాలీవుడ్ భారీ బ‌డ్జెట్ చిత్రం ప్ర‌స్తుతం రెంట్ ప‌ద్ద‌తిలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బు్ మైషోఓటీటీలోనూ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌రో వారం త‌ర్వాత ఫ్రీగా ప్ర‌సారం కానుంది.

Aarya Season 03 Part 02

సుస్మితా సేన్ న‌టించిన హిందీ వెబ్ సిరీస్ సీజ‌న్‌3 పార్ట్‌2 ఈ రోజు నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో హిందీతో పాటు తెలుగు,త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Crunchyroll

Fire Force

ఫైర్ ఫోర్స్ (Fire Force) (2020) అనే జ‌ప‌నీస్ యానిమేష‌న్ సూప‌ర్ హీరో సిరీస్ సీజ‌న్ 2 ప్ర‌స్తుతం త‌మిళ‌,తెలుగు భాష‌ల్లో క్రంచీరోల్ (Crunchyroll) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Bubblegum

రాజీవ్ క‌న‌కాల,సుమ‌ల కుమారుడు రోష‌న్ క‌న‌కాల న‌టించిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం బ‌బుల్ గ‌మ్ (Bubblegum) ఈ రోజు నుంచి (శుక్ర‌వారం) నుంచి ఆహ‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం కేవ‌లం పెద్ద వాళ్ల‌కు మాత్ర‌మే

etv win

Rebels Of Thupakulagudem

యూ ట్యూబ‌ర్ జైత్రీ క‌థానాయుక‌గా ఎంట్రీ ఇస్తూ వ‌చ్చిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం రెబ‌ల్స్ ఆఫ్ తుపాకుల గూడెం (Rebels Of Thupakulagudem ) ప్ర‌స్తుతం ఈ టీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - Feb 10 , 2024 | 07:02 PM