Ott-Chari 111: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన చారి..

ABN , Publish Date - Apr 05 , 2024 | 07:32 PM

వెన్నెల కిశోర్‌(Vennela kishore) కీలక పాత్ర పోషించిన స్పై యాక్షన్‌ కామెడీ మూవీ 'చారి 111’ (Chari 111)సినిమా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime Video) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Ott-Chari 111: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన చారి..
Chari 111 Movie Still

వెన్నెల కిశోర్‌(Vennela kishore) కీలక పాత్ర పోషించిన స్పై యాక్షన్‌ కామెడీ మూవీ 'చారి 111’ (Chari 111)సినిమా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime Video) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మురళీ శర్మ కీలక పాత్రలో నటించారు. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వం వహించగా అదితి సోని నిర్మించారు. సైమన్‌ కె.కింగ్‌ సంగీతం అందించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. పైగా దీన్ని రిలీజ్‌ చేయడానికి ముందే సీక్వెల్‌ కూడా చేయాలని ప్లాన చేశారు.

కథ:

హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో మానవ బాంబు పేలుడు జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎటువంటి పేలుడు పదార్థాలు లభించవు. ఇది ఉగ్రవాదుల పని అని.. వారి ప్లానేంటో కనుక్కోవాలని ముఖ్యమంత్రి రాహుల్‌ రవీంద్రన్‌ సీక్రెట్‌ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు. రుద్రనేత్ర ఏజెన్సీలో చారి (వెన్నెల కిశోర్‌)కి బాంబు పేలుడు కేసు అప్పగిస్తాడు. ఈ ఆత్మాహుతి దాడిని చారి పరిష్కరించాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!

Amala Paul: ఘనంగా అమలాపాల్‌ సీమంతం!


Updated Date - Apr 05 , 2024 | 08:55 PM