Amala Paul: ఘనంగా అమలాపాల్ సీమంతం!
ABN , Publish Date - Apr 05 , 2024 | 05:39 PM
అమలాపాల్ సీమంతం వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. గత ఏడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
![Amala Paul: ఘనంగా అమలాపాల్ సీమంతం!](https://media.chitrajyothy.com/media/2024/20240326/Amala_b324d685b1.jpeg)
అమలాపాల్ (Amala paul) సీమంతం వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. గత ఏడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో (Jagath desai) వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకు గర్భవతినని ప్రకటించింది. గుజరాత్‌లోని సూరత్‌లో సీమంతం వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో (Srimantham) పంచుకుంది అమలా. ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
గతంలో అమలాపాల్ డైరెక్టర్ విజయ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో ఏడడుగులు వేసింది. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జంటగా ఆడుజీవితం చిత్రంలో నటించింది.