ఏడాది త‌ర్వాత OTTలోకి బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌! ఎప్ప‌టి నుంచంటే?

ABN , Publish Date - May 12 , 2024 | 05:25 PM

చాలాకాలం త‌ర్వాత ఓ బాలీవుడ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. 2023 జూన్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం జ‌రా హ‌ట్కే.. జ‌రా బ‌చ్‌కే దాదాపు సంవ‌త్స‌రం త‌ర్వాత ఇప్పుడు ఓటీటీ విడుద‌ల‌కు మోక్షం కుదిరింది.

ఏడాది త‌ర్వాత OTTలోకి బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌! ఎప్ప‌టి నుంచంటే?
jara hatke zara bachke

చాలాకాలం త‌ర్వాత ఓ బాలీవుడ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. 2023 జూన్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం జ‌రా హ‌ట్కే.. జ‌రా బ‌చ్‌కే (Zara Hatke Zara Bachke) దాదాపు సంవ‌త్స‌రం త‌ర్వాత ఇప్పుడు ఓటీటీ విడుద‌ల‌కు మోక్షం కుదిరింది. విక్కీ కౌశ‌ల్ (Vicky Kaushal) , సారా అలీఖాన్ (Sara Ali Khan) జంట‌గా సుమారు రూ.40 కోట్ల‌తో రూపొందిన‌ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 115 కోట‌క‌లు వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించడం గ‌మ‌నార్హం.

sara.jpg

గతంలో తెలుగులో వ‌చ్చిన బంధువులోస్తున్నారు, చుట్టాలొస్తున్నారు జాగ్ర‌త్త వంటి సినిమాల త‌ర‌హాలో రూపొందిన ఈ చిత్రం మంచి సందేశంతో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఆరక‌ట్టుకుంటుంది. చిన్న నాటి నుంచి ఫ్రెండ్స్ అయిన క‌పిల్ , సౌమ్య వారి సాంప్ర‌దాయాలు వేరైనా వారి త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి వివాహం చేసుకుని ఓ అద్దింట్లో కిరాయికి ఉంటుంటారు. ఈ క్ర‌మంలో వారికి కొన్ని స‌మ‌స్య‌లు తెలెత్తుతాయి. ఈ క్ర‌మంలోనే వారు సొంతిల్లు కొనుక్కోవాల‌నే ఆలోచ‌న‌కు వ‌స్తారు.


kaushal.jpg

అయితే వారి వ‌ద్ద స‌రిపోను డ‌బ్బు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ సాయం కోసం బ్రోక‌ర్స్‌ను క‌లుస్తారు. అయితే ఆయ‌న పేద‌ల‌కు, ఓంట‌రి మ‌హిళ‌లకు ఇండ్లు త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్ప‌డంతో క‌పిల్.. సౌమ్య జంట విడాకులు తీసుకునేంద‌కు రెడీ అవుతారు. ఈ నేప‌థ్యంలో వీరి వ్య‌వ‌హారం తెలియ‌క వారి ఫ్యామిలీలో జ‌రిగే గొడ‌వ‌లు, అస‌లు విష‌యం తెలిశాక ఈ కుటుంబంలో జ‌రిగే వ్య‌వ‌హ‌రాల చుట్టూ క‌థ సాగుతూ ఆధ్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా సాగే ఈ సినిమాకు సంగీతం, పాట‌లు చాలా ఫ్ల‌స్ కావ‌డం విశేషం.

GNXUdzzW4AAphbg.jpeg

ఇదిలాఉండ‌గా ఇప్పుడీ చిత్రాన్ని మే 17 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు. హిందీతో పాటు తెలుగు,త‌మిళ‌, మ‌ల‌మాళ భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. చాలాకాలం నుంచి మ‌చి చిత్రం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు ఈ జ‌రా హ‌ట్కే.. జ‌రా బ‌చ్‌కే (Zara Hatke Zara Bachke) సినిమా మంచి ఆఫ్సన్.. డోంట్ మిస్‌. ఒక‌టి రెండు చోట్ల ముద్దు స్నివేశాలు త‌ప్పితే మిగ‌తా సినిమా అంతా కుటుంబంతో క‌లిసి చూడొచ్చు.

Updated Date - May 12 , 2024 | 05:28 PM