Aa Okkati Adakku Ott: స‌డెన్‌గా ఓటీటీకి.. అల్ల‌రి న‌రేశ్ ఫ్యామిలీ, కామెడీ డ్రామా! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే?

ABN , Publish Date - May 30 , 2024 | 08:51 AM

అల్లరి నరేష్ రీసెంట్‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు. ఫరియా అబ్దుల్లా క‌థానాయిక‌గా న‌టించింది. మే 3న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు స‌డ‌న్‌గా డిజ‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

Aa Okkati Adakku Ott: స‌డెన్‌గా ఓటీటీకి.. అల్ల‌రి న‌రేశ్ ఫ్యామిలీ, కామెడీ డ్రామా! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే?
Aa Okkati Adakku

అల్లరి నరేష్ (Allari Naresh) రీసెంట్‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku). జాతి ర‌త్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) క‌థానాయిక‌గా న‌టించింది. మే 3న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు స‌డ‌న్‌గా డిజ‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. చోటాభీమ్ కార్టూన్ నిర్మాత‌ రాజీవ్ చిలక (Rajiv Chilaka) నిర్మించ‌గా మల్లి అంకం (Malli) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Allarinaresh.jpg

వ‌య‌సు మీద ప‌డుతున్నా పెళ్లి కావ‌ట్లేద‌ని గణపతి (అల్లరి నరేష్) మ్యాట్రిమోనిని సంప్ర‌దిస్తాడు. ఈ క్ర‌మంలో సిద్ధి (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడిన గ‌ణ‌ప‌తి పెళ్లి చేసుకుందామ‌ని కోర‌గా సిద్ధి నిరాక‌రించి ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) అని అంటుంది. అదే స‌మ‌యంలో మ్యాట్రిమోని నుంచి అమ్మాయిల ఫోటోలు, నంబర్స్ గణపతికి పంపించ‌గా అందులో కొంద‌రికి పెళ్లవ‌డం, మ‌రి కొంత‌మంది చేసుకోన‌ని చెప్పుతుండ‌డంతో విసిగిపోయిన గ‌ణ‌ప‌తి అప్ప‌టికే రెండు సార్లు విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అవుతాడు.


allarinareshfaria.jpg

ఈ క్ర‌మంలో అనుకోకుండా సిద్ధి నేప‌థ్యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో అంతా తారుమారవుతుంది. అస‌లు సిద్ధి ఎవ‌రు, పెళ్లి పేరుతో మ్యాట్రిమోని సంస్థ‌లు స‌మాజంలో ఎలాంటి ఘోరాలు జ‌రుగుతున్నాయ‌నే ఆస‌క్తిక‌ర‌మైర క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది. ఇప్పుడీ సినిమా మే 31 ఆర్థ‌రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌ (Prime VideoIN) ఓటీటీ (Ott)లో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేయ‌నుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఎంచ‌క్కా ఇంట్లోనే కూర్చుని ఈ ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) ఫ్యామిలీ, కామెడీ చిత్రాన్ని చూసేయ‌వ‌చ్చు.

Updated Date - May 30 , 2024 | 11:10 AM