మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అత్తమ్మ సురేఖ కొణిదెల పుట్టినరోజున.. కోడలు ఉపాసన ఏం చేసిందో చూశారా..

ABN, Publish Date - Feb 18 , 2024 | 06:51 PM

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు.

Surekha and Upasana

చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల (Surekha Konidela) సిద్ధం చేస్తుంటారనే విషయం తెలిసిందే. కొణిదెల వంటకాలను ‘అత్తమ్మ కిచెన్’ (Athammas Kitchen) ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన (Upasana Konidela) లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌ వారి కడుపు నింపుతాయని అంటున్నారు. ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు.

ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా ‘అత్తమ్మ కిచెన్’ని నిలబెట్టాలని ఉపాసన (Upasana Konidela) కాంక్షిస్తున్నారు. వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా ఈ ‘అత్తమ్మ కిచెన్’ నిలుస్తుందని వారు భావిస్తున్నారు. సురేఖ కొణిదెల పుట్టినరోజున వారు ఈ వెంచర్‌ను ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

====================

*‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..’ ఆడియో క్యాసెట్‌ కోసం పుట్టిన పాటని తెలుసా?

**************************

*Allu Arjun: 1, 2, 3.. పుష్ప కథను కొనసాగించాలనుకుంటున్నాం..

****************************

*Chiranjeevi: నా జీవన రేఖ.. భార్య సురేఖకు చిరు బర్త్‌డే విశెస్

*****************************

Updated Date - Feb 18 , 2024 | 06:51 PM