తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ ప్రముఖులు

ABN , Publish Date - Jan 28 , 2024 | 08:17 PM

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిరు, బాలయ్య, నాగ్, వెంకీలు ప్రత్యేకంగా కలిసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్‌లోని వివిధ శాఖలకు చెందిన పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ ప్రముఖులు
Telugu Film Producers and Union members met Telangana CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి వారంతా స్వయంగా వెళ్లి కలిసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

Revanth-1.jpg

వీరితో పాటు పలువురు ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ తరపున సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్‌లోని వివిధ శాఖలకు చెందిన పలువు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు.

CM-Revanth-3.jpg

సీఎంను కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి వంటి ప్రముఖులు ఉన్నారు.

CM-Revanth-2.jpg

వీరితో పాటు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ వంటి వారంతా ఉన్నారు.

YVS.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Raveena Tandon: ఆ వదంతులకు తావు లేదు.. ఇప్పుడే చాలా బావుంది

***************************

*Fighter: హృతిక్ రోషన్ కెరీర్‌లో ఆ ఘనత సాధించిన 14వ చిత్రంగా ‘ఫైటర్’

***************************

*Esha Gupta: ఇక్కడ వైట్‌ స్కిన్‌ ఉండే నటులదే హవా..

***********************

Updated Date - Jan 28 , 2024 | 08:17 PM