Jaya Jaya Nrusimha: సుకుమార్, బోయపాటి చేతుల్లో పురాణపండ గ్రంథ పరిమళం

ABN , Publish Date - Mar 29 , 2024 | 10:29 PM

ఇటీవల రెండు షూటింగ్‌ల ప్రారంభోత్సవాలకు విడివిడిగా హాజరైన ప్రముఖ దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనులిద్దరూ తమ కార్లలో ఒకే పుస్తకాన్ని అధ్యయనం చేస్తూ వెళ్లటం గమనార్హం. తెలుగు చలన చిత్ర రంగంలో దర్శక నిర్మాతల మొదలు చిన్న ఆర్టిస్ట్ వరకూ ఎంతోమంది పూజాపీఠాలముందు మిల మిలల సౌందర్యంతో మంత్రముగ్ధం చేసే భక్తి చైతన్య గ్రంధాలు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వే అధికంగా కనిపిస్తాయి.

Jaya Jaya Nrusimha: సుకుమార్, బోయపాటి చేతుల్లో పురాణపండ గ్రంథ పరిమళం

ఇటీవల రెండు షూటింగ్‌ల ప్రారంభోత్సవాలకు విడివిడిగా హాజరైన ప్రముఖ దర్శకులు సుకుమార్ (Director Sukumar), బోయపాటి శ్రీను (Boyapati Srinu)లిద్దరూ తమ కార్లలో ఒకే పుస్తకాన్ని అధ్యయనం చేస్తూ వెళ్లటం గమనార్హం. తెలుగు చలన చిత్ర రంగంలో దర్శక నిర్మాతల మొదలు చిన్న ఆర్టిస్ట్ వరకూ ఎంతోమంది పూజాపీఠాలముందు మిల మిలల సౌందర్యంతో మంత్రముగ్ధం చేసే భక్తి చైతన్య గ్రంధాలు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) వే అధికంగా కనిపిస్తాయి. ఈ కోవలోంచి చూసినప్పుడు ఇప్పుడు బోయపాటి, సుకుమార్ చేతుల్లో మనకు కనిపిస్తున్న పుస్తకం కూడా పురాణపండ శ్రీనివాస్ దే కావడం విశేషం.

పురాణపండ శ్రీనివాస్ విలక్షణ కలంనుంచి అందిన ఈ అమృత పేటిక పేరు.. ‘జయ జయ నృసింహ’ (Jaya Jaya Nrusimha). దశావతారాల్లో వీరావతారమైన నారసింహుని అద్భుత ఘట్టాలతో భారత, భాగవత సన్నివేశాల కథల్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనంగా అందిన ఈ ‘జయ జయ నృసింహ’ అఖండ గ్రంధంలో అతి అరుదైన వివిధ వర్ణాల నూట ఇరవై నాలుగు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయని బోయపాటి చెప్పారు. ఆత్మబలాల మహాబలాల మంత్ర పేటికలే పురాణపండ శ్రీనివాస్ కఠోర సాధనలని, శ్రీనివాస్ శైలి ఋతువుల వర్ణనలా మనోహరంగా ఉందని ప్రశంసించారు.


Sai-Korrapati.jpg

‘ఈగ (Eega), లెజెండ్ (Legend), కెజియఫ్ (KGF)’ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ప్రముఖ చలన చిత్ర నిర్మాణసంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ ‘జయ జయ నృసింహ’ను ఒక సాధకునిలా నిర్వచనాలకు అతీతంగా తన రచనా సౌందర్యాన్ని సొగసులతో అందించడంతో సినీ ప్రముఖుల్ని కూడా ఆకట్టుకుంటోంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నగరంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో దేశంలోనే మొదటిసారి అరుదైన కృష్ణ శిలలతో సాయి కొర్రపాటి నిర్మించిన ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ (Sri Amrutheshwara Alayam)కు స్ఫూర్తి కూడా తన ఆత్మీయ మిత్రులు పురాణపండ శ్రీనివాసేనని, ఇది శివాజ్ఞగా భావిస్తున్నానని సాయి కొర్రపాటి (Sai Korrapati) బాహాటంగానే ప్రకటించారు కూడా.

Srinivas.jpg

మానవీయ విలువలతో ఒక సాధకునిగా, సత్యాన్వేషిగా, దివ్య గ్రంధాల అద్భుత రచనా సంకలన కర్తగా, శ్రీశైల దేవస్థాన గత ప్రత్యేక సలహా దారునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకునిగా లక్షల పాఠకులకు పురాణపండ శ్రీనివాస్ చిరపరిచితులే. ఆర్తితోనూ, ఆందోళనతోనూ సతమతమవుతున్న వారికి ఎంతో కొంత వెలుగు చూపించగల పురాణపండ అమోఘ భక్తి గ్రంథాల్ని స్వీకరిస్తున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందని, శ్రీనివాస్ ఈ పుస్తకాల్ని తీర్చిదిద్దినప్పుడు ఆ సౌకుమార్యం అనుభూతికి వచ్చి భక్త పాఠకుడు పొందే ఆనందం మనస్సు ఎల్లలు దాటుతుందని కొందరు సినీ ప్రముఖులనడం మామూలు విషయంకాదంటున్నారు సినీ విశ్లేషకులు. అన్నిటికీ మించి శ్రీనివాస్‌కి అస్సలు స్వార్ధం లేకపోవడం వల్లనే ఆపదల్ని కూడా విసిరికొట్టి ... ఆపద్బాంధవుడైన తిరుమల శ్రీనివాసునికి దాసోహమై అద్భుతాల్ని మనకు సమర్పిస్తున్నారని అటు సాహితీ రాజకీయ సాంస్కృతిక రంగాల ప్రముఖులు, ఇటు గ్రంథ ప్రేమికులైన సినీ ప్రముఖులు బహిరంగంగానే పేర్కొనడం విశేషం.

ఇది కూడా చదవండి:

*Sivassivam: శ్రీ అమృతేశ్వరుని మహా శివరాత్రి వైభవమే ‘శివశ్శివమ్’

Updated Date - Mar 29 , 2024 | 10:31 PM