Sivassivam: శ్రీ అమృతేశ్వరుని మహా శివరాత్రి వైభవమే ‘శివశ్శివమ్’

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:27 PM

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి ఇటీవల ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత అద్భుతంగా బళ్లారి నగరంలో ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ నిర్మించిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా సాయి కొర్రపాటి గత మూడు రోజులుగా చేస్తున్న శివార్చనలు, అభిషేకాలు, హోమాలు, కళ్యాణాలతో పరవసిస్తున్న ఆలయ ప్రాంగణంలో వేలాది భక్తులకు అమృతేశ్వరాలయ సమర్పణలో రూపొందించిన ‘శివశ్శివమ్’ ప్రత్యేక గ్రంధం వేలకొలది భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.

Sivassivam: శ్రీ అమృతేశ్వరుని మహా శివరాత్రి వైభవమే ‘శివశ్శివమ్’
Maha Shivratri Poojas at Sree Amrutheshwara Temple

బళ్లారి: ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి (Sai Korrapati) ఇటీవల ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత అద్భుతంగా బళ్లారి నగరంలో నిర్మించిన ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ (Sree Amrutheshwara Temple) ప్రారంభవైభవం అటు కన్నడ చలన చిత్ర రంగంలో, ఇటు తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతగా సంచలనం సృష్టిందో గత వారం రోజులుగా తెలుస్తూనే ఉంది. అసాధారణ ప్రజ్ఞావంతులైన ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌కి, నిర్మాత సాయి కొర్రపాటికి వున్న గాఢమైన మైత్రీబంధంలోంచి అవతరించిన పవిత్ర మహాసంకల్పమే ఈ అరుదైన శ్రీ అమృతేశ్వరుని కృష్ణ శిలా సౌందర్య ప్రాభవానికి నిదర్శనమని ప్రముఖులెందరో అభినందనలు కురిపిస్తున్నారు. వజ్ర కాంతుల స్ఫటిక లింగ ప్రతిష్టకు హాజరైన రాజమౌళి, ప్రఖ్యాత దర్శకుడు కీరవాణి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌లు ఆశ్చర్యంగా సాయి కొర్రపాటి సాహసాన్ని, భక్తిని ప్రశంసించారు.

మహాశివరాత్రి సందర్భంగా సాయి కొర్రపాటి గత మూడు రోజులుగా చేస్తున్న శివార్చనలు, అభిషేకాలు, హోమాలు, కళ్యాణాలతో పరవసిస్తున్న ఆలయ ప్రాంగణంలో వేలాది భక్తులకు అమృతేశ్వరాలయ సమర్పణలో రూపొందించిన ‘శివశ్శివమ్’ ప్రత్యేక గ్రంధం వేలకొలది భక్తులను విశేషంగా ఆకట్టుకొంది. అతి అరుదైన అపురూప శైవ వర్ణ చిత్రాలతో, శైవ ఆగమ మంత్ర శక్తులతో రూపొందిన ఈ ‘శివశ్శివమ్’ గ్రంధానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) రచనా సంకలన కర్త కావడం విశేషం. శివానుగ్రహమైన ఈ దివ్యమైన పుస్తకాన్ని వేలాది భక్తులకు ఆలయ కమిటీ ఉచితంగా అందించారు.


Sivassivam.jpg

గతంలో సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ పరమ రమణీయ వైభవంగా అందించిన ఐదు వందల ఆంజనేయ చిత్రాలతో కూడిన మంత్ర శక్తుల ఉపాస్య గ్రంధం ‘నేనున్నాను’ని భారత దేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి అభినందనలు వర్షించడం వారాహి చలన చిత్రం చరిత్రలో మరొక మైలు రాయి అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక ప్రముఖ నిర్మాత, అందునా దర్శక ధీరుడైన రాజమౌళికి అత్యంత ఆత్మీయుడు సాయి కొర్రపాటి సంవత్సర కాలం అవిశ్రాంత కృషికి పచ్చ జెండా ఊపిన, సాయి కొర్రపాటి శివాజ్ఞతో మనస్సులో భక్తి బీజం నాటిన పురాణపండను పరోక్షంగా, ప్రత్యక్షంగా అభినందిస్తూ.. సినీ మసాలా ప్రపంచంలోంచి, మంగళకర దైవీయ ప్రపంచంలో సాయి కొర్రపాటి అడుగులు వేయడం మామూలు విషయం కాదని.. ఇదంతా పూర్వ జన్మ సుకృతమంటూ ప్రముఖులెందరో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

*******************************

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

Updated Date - Mar 09 , 2024 | 10:27 PM