Dr. LV Gangadhara Sastry: నా పరమ లక్ష్యం మాత్రం అవార్డులు కాదు.. ఏంటంటే?

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:05 PM

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాక్టర్ ఎల్ వి గంగాధర శాస్త్రి - భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023’ను అందుకున్నారు. సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను, స్వీయ సంగీతంలో, తాత్పర్య సహితంగా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, లోకార్పణ చేసినందుకు ‘భారతీయ ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగం’లో ఆయనను ఈ అవార్డు‌తో భారత ప్రభుత్వం గౌరవించింది.

Dr. LV Gangadhara Sastry: నా పరమ లక్ష్యం మాత్రం అవార్డులు కాదు.. ఏంటంటే?
Dr LV Gangadhara Sastry Received Kendra Sangeet Natak Akademi Award 2023

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాక్టర్ ఎల్ వి గంగాధర శాస్త్రి (Dr LV Gangadhara Sastry) - భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము (President of India Mrs. Draupadi Murmu) చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023’ (Kendra Sangeet Natak Akademi Award 2023)ను అందుకున్నారు. సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను, స్వీయ సంగీతంలో, తాత్పర్య సహితంగా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, లోకార్పణ చేసినందుకు ‘భారతీయ ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగం’ (Classical Music Department of India)లో ఆయనను ఈ అవార్డు‌తో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ కార్యక్రమం న్యూ‌ఢిల్లీ‌లోని విజ్ఞాన్ భవన్‌ (Vigyan Bhawan, New Delhi)లో 6 మార్చి, 2024న జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు జి కిషన్ రెడ్డి.. కేంద్ర చట్టము మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, పార్లమెంట్ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖామాత్యులు అర్జున్ రామ్ మేఘ్వాల్.. సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచ.. కేంద్ర సాంస్కృతిక శాఖ సెక్రటరీ గోవింద్ మోహన్‌లు పాల్గొన్నారు.

కార్యక్రమానంతరం గంగాధర శాస్త్రి పాత్రికేయులతో మాట్లాడుతూ.. గతంలో డా ఏపిజె అబ్దుల్ కలాం గారికి నా భగవద్గీత వినిపించి ప్రశంసలు పొందడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’, మధ్యప్రదేశ్‌లోని పాణిని యూనివర్సిటీ నుంచి ‘గౌరవ డాక్టరేట్’, ఇప్పుడు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ముగారి చేతుల మీదుగా ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు అందుకోవడం.. అందునా నా తల్లితండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ జాతీయ అవార్డు అందుకోవడం అసలైన ఆనందాన్నిస్తోంది. ఈ SNA అవార్డు నా ‘గీతా’ పరిశ్రమను గుర్తించి మంత్రులు జి కిషన్ రెడ్డిగారు అందించినదిగా భావిస్తాను. జన్మనిచ్చిన తల్లితండ్రులకు, మాతృభూమికి, మాతృదేశానికి ఇంతకంటే తిరిగి ఏమివ్వగలను. ఈ అవార్డులూ ప్రశంసలూ అన్ని నా భగవద్గీతా మార్గానికే రావడం ఆత్మానందాన్ని కలగజేస్తోంది. ఇది ఏదీ నా ఒక్కడి ప్రతిభ కాదు. నేను నిమిత్తమాత్రుడిని.. అనుకోని నా గీతా ప్రయాణమంతా కృష్ణ పరమాత్ముని సంకల్పం.. నా తల్లి తండ్రుల తపఃఫలం..! (I want every single Hindu in this country to read the Bhagavad Gita)


Kishan-Reddy.jpg

అయితే నా పరమ లక్ష్యం మాత్రం అవార్డులు కాదు. ‘ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలి. ముఖ్యంగా ఈ దేశంలోని ప్రతి ఒక్క హిందువూ భగవద్గీత చదవాలి ... అర్ధం చేసుకోవాలి... ఆచరించాలి... తరువాత తరాలకు అందించాలి.. తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి...! భారతీయ ఆధ్యాత్మికత దేశ కాల జాత్యాదులకు అతీతమైనది. కుల మత వర్గ లింగ విభేదాలకు తావులేనిది .. దీనిని ప్రపంచ వ్యాప్తం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్నీ, విశ్వ శాంతినీ సాధించవచ్చు.. అప్పుడే మాకు అసలైన ఆనందం. మా లాంటి ధర్మ ప్రచారకుల వ్యవస్థల గురించి తెలుసుకుని ప్రభుత్వమే చేయూతనివ్వాలి. చేయూతకోసం మేము ప్రభుత్వాలను అర్ధించే పరిస్థితి ఉండరాదు. గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. పాఠశాలల్లో పాఠ్య అంశంగా భగవద్గీతను చేర్చాలి. అప్పుడే మనం మన దేశ అస్థిత్వాన్ని కాపాడుకున్నట్టు. భగవద్గీతను మతం అనే కోణం నుంచి చూడవద్దు. అలా ఐతే ఇంగ్లీషు నేర్చుకోవడం క్రైస్తవం అవుతుంది కదా...!. అందరినీ సమానంగా చూడమని చెప్పే ధర్మ మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణులకు జన్మనిచ్చిన భారత భూమిపై పుట్టినందుకు గర్వపడతాను’ అని అన్నారు గంగాధర శాస్త్రి. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచా (Mrs. Sandhya Purecha).. గంగాధర శాస్త్రిని దుశ్శాలువతో సత్కరిస్తూ - త్వరలో తమ అకాడమీ తరపున గీత ద్వారా ధర్మ ప్రచార కార్యక్రమాలను కూడా వేదికలపైన నిర్వహించబోతున్నట్టు చెబుతూ అందుకు గంగాధర శాస్త్రి సహకారాన్ని కోరారు.

Gangadhar-Sastry.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

*Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..

*******************************

*Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...

****************************

Updated Date - Mar 08 , 2024 | 03:05 PM