Ram Charan: బ్రహ్మానందం బుక్‌పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - Jan 10 , 2024 | 05:26 PM

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. బ్ర‌హ్మానందం జీవితంలోని అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో, అనుభ‌వాల‌తో ప్ర‌చురిత‌మైంది ‘నేను’. బ్ర‌హ్మానందం ఆటోబ‌యోగ్ర‌ఫీగా విడుద‌లైన ‘నేను’ పుస్త‌కాన్ని గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి బ‌హూక‌రించారు ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం. ప్ర‌తి ఒక్క‌రూ చ‌ద‌వ‌ద‌గ్గ పుస్త‌కం ఇదని అన్నారు రామ్ చరణ్.

Ram Charan: బ్రహ్మానందం బుక్‌పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..
Ram Charan and Brahmanandam

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ (Global Star Ram Charan)ని ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం (Brahmanandam) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. బ్ర‌హ్మానందం జీవితంలోని అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో, అనుభ‌వాల‌తో ప్ర‌చురిత‌మైంది ‘నేను’ (Nenu). బ్ర‌హ్మానందం ఆటోబ‌యోగ్ర‌ఫీగా విడుద‌లైన నేను పుస్త‌కానికి బ్ర‌హ్మానందం అభిమానుల్లోనూ, సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా, పుస్త‌క ప్రియుల్లోనూ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. నేను ఆటోబ‌యోగ్ర‌ఫీ గురించి ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా మ‌న‌సారా అభినందించారు. బ్రహ్మానందం కృషిని ప్ర‌శంసించారు. ఇప్పుడు మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ వంతు వచ్చింది. తాజాగా గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి త‌న ఆటోబ‌యోగ్ర‌ఫీ ‘నేను’ బుక్‌ను బ‌హూక‌రించారు ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం.


Ram-Charan.jpg

‘నేను’ పుస్త‌కాన్ని అందుకున్న రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ‘‘బ్ర‌హ్మానందంగారు త‌మ జీవితంలోని అనుభ‌వాల‌తో ‘నేను’ రాశారు. అత్య‌ద్భుత‌మైన ఆయ‌న జీవిత ప్ర‌యాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్క‌డ‌క్క‌డా చ‌మ‌త్కారంతో, మ‌న‌సులోని ఎన్నెన్నో విష‌యాల‌ను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాల‌ను నేర్పుతూ, అనుభ‌వాల‌ను పంచుకుంటూ, అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తూ, ఎన్నో సినిమాల సంగ‌తుల‌ను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్త‌కం. బ్ర‌హ్మానందంగారు రాసిన ఆటోబ‌యోగ్ర‌ఫీ ‘నేను’ అంద‌రికీ అందుబాటులో ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ చ‌ద‌వ‌ద‌గ్గ పుస్త‌కం ఇది’’ అని ట్వీట్ చేశారు గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. (Global Star Ram Charan Reaction on Comedy King Brahmanandam Biography Nenu)


ఇవి కూడా చదవండి:

====================

*Janhvi Kapoor: ప్రేమలో పడిపోయా.. నాని ‘హాయ్ నాన్న’పై జాన్వీకపూర్

************************

*నన్ను క్షమించు స్వామీ... కెప్టెన్‌ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం

***************************

*Guntur Kaaram: ‘మావ ఎంతైనా’.. లిరికల్ సాంగ్

***************************

*Vijay Sethupathi: హిందీ నేర్చుకోవద్దని ఎవరూ చెప్పలేదు

*******************************

Updated Date - Jan 10 , 2024 | 05:26 PM