Gama Awards: టాలీవుడ్ గర్వపడేలా దుబాయిలో గామా అవార్డ్స్ వేడుక.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Feb 23 , 2024 | 06:46 PM

దుబాయ్‌లో ఏ‌ఎఫ్‌ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ ‘గామా’ తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించనున్నారు. శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని.. వేడుకకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

Gama Awards: టాలీవుడ్ గర్వపడేలా దుబాయిలో గామా అవార్డ్స్ వేడుక.. ఎప్పుడంటే?
Gama Awards Curtain Raiser Event

దుబాయ్‌లో ఏ‌ఎఫ్‌ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ ‘గామా’ తెలుగు మూవీ అవార్డ్స్ (Gama Telugu Movie Awards) 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్‌లోని జబిల్ పార్క్‌లో ప్రెస్టీజియస్‌గా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించనున్నారు. శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయాతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించిన ట్రోఫీని లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. గతంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్, ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించలేకపోయారు. కానీ ఈసారి టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు. 2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి - బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్ వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. (Gama Awards Curtain Raiser Event)


Dimple-Hayathi.jpg

ఈ జ్యూరీలో సభ్యుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉందని.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుందని.. చాలా జెన్యూన్‌గా అవార్డు వేడుకను నిర్వహించబోతున్నామని అన్నారు దర్శకుడు విఎన్ ఆదిత్య. తెలుగువారు గర్వపడేలా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం ఒక తెలుగువాడిగా గర్విస్తున్నానని రఘు కుంచే చెప్పగా.. కేసరి త్రిమూర్తులు ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత డీవీవీ దానయ్య.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.. వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్య.. దుబాయ్‌లో ఈ గామా వేదిక‌ను గొప్పగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖులందరినీ ఈ వేడుకకు ఆహ్వానించామని అన్నారు. ఈ గామా అవార్డ్స్‌లో భాగమవడం ఆనందంగా ఉందని డింపుల్ చెప్పగా.. ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలుగు సినిమా దర్శకుల వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ అన్నారు.

ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’తో పాటు, ప్రఖ్యాత గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సంగీత దర్శకులు.. దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, గాయకులు.. మనో, ధనుంజయ్.. ఇంకా ఎందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Tantra: పిల్ల బచ్చాల్లారా.. మా సినిమాకు రావద్దు.. వార్నింగ్ అదిరింది

************************

*Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ RC 16పై ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

************************

*BVS Ravi: ఆత్మలని పిలవకుండా.. వాళ్లింట్లోనే పేరంటమా?

**************************

Updated Date - Feb 23 , 2024 | 06:46 PM