మాదాపూర్ ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ వేడుకలో సెలబ్రిటీల సందడి

ABN , Publish Date - Mar 30 , 2024 | 07:52 PM

మాదాపూర్ క్యాపిటల్ పార్క్‌లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ ఈవెంట్‌లో బుల్లితెర, వెండితెరకు చెందిన సెలబ్రిటీలు సందడి చేశారు. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి వినూత్న కాన్సెప్ట్‌తో, మంచి అనుభూతినిచ్చేలా ఈ కేఫ్ ఉందని వారంతా చెప్పుకొచ్చారు. ఈ వేదిక పార్టీ ఔత్సాహికులు మరియు సెలబ్రిటీలకు మంచి పార్టీ ప్లేస్ అని నిర్వహకులు రవి కిరణ్ తెలిపారు.

మాదాపూర్ ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ వేడుకలో సెలబ్రిటీల సందడి
Small Screen and Silver Screen Celebrities

మాదాపూర్ (Madhapur) క్యాపిటల్ పార్క్‌లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ ఈవెంట్‌లో బుల్లితెర, వెండితెరకు చెందిన సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో బిగ్ బాస్ సన్నీ, అర్జున్, మెహబూబ్, అశ్వని, తనీష్, నవీన్, మహేష్ వంటి బుల్లితెర, వెండితెరకు చెందిన తారలు పాల్గొన్నారు. ఎఫ్ కేఫ్ అండ్ బార్ అత్యాధునిక థీమ్‌ను కలిగి ఉందని.. ఇందులో కైనెటిక్ లైట్లు, అతిపెద్ద లాంజ్, విశాలమైన స్థలం, విద్యుదీకరణ వంటి వన్నీ అందరినీ పార్టీ మూడ్‌లోని లీనమయ్యే వాతావరణాన్ని సృష్టిస్తాయని.. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి వినూత్న కాన్సెప్ట్‌తో, మంచి అనుభూతి ఇచ్చేలా రూపొందించినట్లుగా నిర్వహకులు రవి కిరణ్ చెప్పుకొచ్చారు. (Celebrities at F Cafe and Bar Launch)

*మరిన్ని ఫొటోలను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


F-Cafe-and-Bar.jpg

ఇంకా ఆయన మాట్లాడుతూ.. వినూత్న కాన్సెప్ట్‌తో ఈ ఎఫ్ కేఫ్ అండ్ బార్‌ని హైదరాబాద్‌ (Hyderabad)లో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. కేఫ్, బార్ లైఫ్ ఇష్టపడేవారికి మంచి అనుభూతిని అందించడమే మా లక్ష్యం. ఇక్కడ ప్రపంచ స్థాయి ఆతిథ్యంతో కొత్త కొత్త థీమ్స్‌తో వినూత్నంగా అన్నీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్ కేఫ్ లైఫ్ వారికి మ్యూజిక్‌తో పాటు మంచి ఫుడ్, పల్సేటింగ్ బీట్‌లు, రుచికరమైన పానీయాలు మరియు అద్భుతమైన వంటకాలను అందించనున్నాం. ఈ వేదిక పార్టీ ఔత్సాహికులు మరియు సెలబ్రిటీలకు మంచి పార్టీ ప్లేస్ అని తెలిపారు.

F-Cafe.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

*Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ

***********************

Updated Date - Mar 30 , 2024 | 07:52 PM