OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న.. కొరియ‌న్‌ సైన్స్‌ఫిక్ష‌న్, యాక్ష‌న్‌, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 06:42 PM

ఓటీటీలోరెండు కోరియ‌న్ చిత్రాలు అద‌ర‌గొడుతున్నాయి. సైన్స్‌ఫిక్ష‌న్, యాక్ష‌న్‌, హ‌ర్ర‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చిన‌ ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ఐదేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఇటీవ‌లే తెల‌గు భాష‌లో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రాగా ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్న‌ది.

OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న.. కొరియ‌న్‌ సైన్స్‌ఫిక్ష‌న్, యాక్ష‌న్‌, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌
the witch

ఓటీటీలో ది విచ్ (The Witch) అనే రెండు కొరియ‌న్‌ చిత్రాలు అద‌ర‌గొడుతున్నాయి. సైన్స్‌ఫిక్ష‌న్, యాక్ష‌న్‌, హ‌ర్ర‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చిన‌ ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ఐదేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఇటీవ‌లే తెల‌గు భాష‌లో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రాగా ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్న‌ది. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ మూవీ మొద‌టి భాగం ది విచ్ పార్ట్‌1.. స‌బ్ వెర్ష‌న్ (The Witch: Part 1. The Subversion) పేరుతో 2018లో విడుద‌లవ‌గా రెండో భాగం ది అద‌ర్ వ‌న్ (The Witch: Part 2. The Other One) పేరుతో 2022 జూలైలో విడుద‌లై ద‌క్షిణ కొరియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కిమ్ డా-మి (Kim Da-mi), జో మిన్-సు, పార్క్ హీ, చోయ్ వూ-షిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్నిపార్క్ హూన్ జంగ్ ర‌చించి ద‌ర్శ‌క్తం వ‌హించారు.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే ఓ ర‌హ‌స్య ప్రాంతంలో నిర్వ‌హిస్తున్న ఓ ల్యాబ‌రేట‌రీలో హ‌త్యాకాండ జ‌రుగుతుండ‌గా జాయ్ హూన్ అనే ఓ అమ్మాయి త‌ప్పించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి ఓ రైతు పొలంలో స్పృహ త‌ప్పి ప‌డిపోతుంది. గ‌మ‌నించిన ఆ రైతులు ఈ అమ్మాయిని ర‌క్షించి త‌మ బిడ్డ‌లా పెంచుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలో ప‌ది సంవ‌త్స‌రాలు గ‌డిచాక అమ్మాయి (జాయ్ హూన్) గ‌త జ్ఞాప‌కాలను మ‌రిచిపోయి సాధార‌ణ జీవితం గ‌డుపుతూ ఉంటుంది. అయితే వారికి ఇర్థిక స‌మ‌స్య‌లు, త‌ల్లికి అల్జీమ‌ర్స్ రోగం రావ‌డంతో వారిక చేదోడు వాదోడుగా ఉంటుంది. అయితే డ‌బ్బు సంపాద‌న కోసం ఆ యువ‌తి (జాయ్ హూన్) ఓ టీవీ షోలో పాల్గొని త‌న‌కున్న శ‌క్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌గా ఇది చూసిన ఆ గ‌త ల్యాబొరేట‌రీ యాజ‌మాన్యం ఈ అమ్మాయిని గ‌ర్తు ప‌ట్టి అమెను తిరిగి తీసుకు రావ‌డానికి ఓ గ్యాంగ్‌ను పంపుతుంది.

అప్ప‌టికే మ‌రో గ్యాంగ్ అ యువ‌తి(జాయ్ హూన్)ని ఫాలో అవుతూ అ ఇంటికి వెళ్లి అమ్మాయి చెల్లిని చంపేస్తామ‌ని బెదిరించ‌డంతో స‌ద‌రు యువ‌తి (జాయ్ హూన్) త‌న శ‌క్తుల‌తో అక్క‌డికి వ‌చ్చిన వారంద‌రిని చంపేస్తుంది. అనంత‌రం అక్క‌డికి వ‌చ్చిన మ‌రోక‌రితో ల్యాబ‌రేట‌రీకి వెళ్ల‌గా త‌ర్వాత ఏం జ‌రిగింద‌నే క‌థ‌తో అద్యంతం చాలా ఆసక్తిగా సినిమాను రూపొందించారు. ముఖ్యంగా చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్టు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతోను క‌లిసి సినిమా చూసేయ‌వ‌చ్చు, ఎక్క‌డ వ‌ల్గ‌ర్ స‌న్నివేశాలు లేవు గానీ ర‌క్త‌పాతం అనేది ఫీక్స్‌లో ఉంటుంది. తెలుగు డ‌బ్బింగ్ కూడా మంచిగా కుదిరింది.


ఇక రెండో పార్టు ది అద‌ర్ వ‌న్ కూడా దాదాపు ఇలాంటి క‌థ‌తోనే ఉంటుంది. ల్యాబ‌రేట‌రీ నుంచి ఓ అమ్మాయి త‌ప్పించుకోవ‌డం ఓ అక్కా, త‌మ్ముడు మాత్ర‌మే ఉంటున్న ఇంటిలో వారితో క‌లిసిపోయి జీవిస్తుంటుంది. ఈక్ర‌మంలో అ అక్క వాళ్ల బాబాయి అ ఇంటి స్ళ‌లాన్ని త‌న పేర చేయాల‌ని వారిపై దాడి చేయ‌డంతో ఈ యువ‌తి త‌న శ‌క్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో వెలుగులోకి వ‌స్తుంది. దీంతో ఈమెను ప‌ట్టుకోవ‌డానికి మ‌రో రెండు గ్యాంగ్‌లు రంగంలోకి దిగుతాయి. త‌ర్వాత స్టోరీ ఎక్క‌డికి దారి తీసింద‌నే దానిపై ఉంటుంది. ఈ అమ్మాయికి, పార్ట్ 1లోని అమ్మాయికి లింక్ ఎంటో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రం క‌థ అచ్చం పార్ట్ 1లానే ఈ క‌థ సాగిన‌ప్ప‌టికీ మ‌న‌కు ఎక్క‌డా అ వాస‌న త‌గ‌ల‌దు. మ‌నం కొత్త సినిమానే చూస్తున్నామ‌నే భావ‌న వ‌స్తుంది. క్లైమాక్స్ అబ్బుర ప‌రుస్తుంది. సో మీకు స‌మ‌యం ఉంటే ఈ పండుగ‌కు ఈ రెండు సినిమాలు మన తెలుగులోనే చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎక్క‌డా అస‌భ్య స‌న్నివేశాలు, బోల్డ్‌ స‌న్నివేశాలు లేవు.


Avantika Vandanapu: మ‌నం చూస్తున్న‌ది నిజ‌మేనా.. ఈ అమ్మాయిని గుర్తు ప‌ట్టారా? https://www.chitrajyothy.com/2024/viral/avantika-vandanapu-mean-girls-goes-viral-srk-50257.html

Updated Date - Jan 15 , 2024 | 06:04 AM