Oppenheimer : మూడేళ్ల కష్టం.. సవాళ్లు.. విమర్శలు.. ఆస్కార్‌!

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:34 AM

‘ఓపెన్‌హైమర్‌’ (Oppenheimer) చిత్రం ఆస్కార్‌ వేదికపై సత్తా చాటింది. ముందు నుంచీ ఊహించినట్లుగానే ఆస్కార్‌ను (Oscar 2024) కైవసం చేసుకుంది. అంతే కాదు ఏడు విభాగాల్లో అవార్డులు అందుకుని సత్తా చాటింది. ప్రస్తుతం ఎక్కడ చేసిన ఈ చిత్రం గురించే చర్చ.

Oppenheimer : మూడేళ్ల కష్టం.. సవాళ్లు.. విమర్శలు.. ఆస్కార్‌!

‘ఓపెన్‌హైమర్‌’ (Oppenheimer) చిత్రం ఆస్కార్‌ వేదికపై సత్తా చాటింది. ముందు నుంచీ ఊహించినట్లుగానే ఆస్కార్‌ను (Oscar 2024) కైవసం చేసుకుంది. అంతే కాదు ఏడు విభాగాల్లో అవార్డులు అందుకుని సత్తా చాటింది. ప్రస్తుతం ఎక్కడ చేసిన ఈ చిత్రం గురించే చర్చ. క్రిస్టఫర్‌ నోలన్‌(Christopher Nolan) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు...

క్రిస్టఫర్‌ నోలన్‌  తెరకెక్కించిన మొదటి బయోపిక్‌ ‘ఓపెన్‌హైమర్‌’. దీన్ని ‘ది ట్రయంఫ్‌ అండ్‌ ట్రాజెడీ ఆఫ్‌ జె రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌’ అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు. కథ రెడీ అయినప్పటి నుంచి ఈ చిత్రం కోసం మూడేళ్లు కష్టపడ్డారు దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌. ఆయన దర్శకత్వంలో 2020లో వచ్చిన ‘టెనెట్‌’ తర్వాత పూర్తిగా ఈ చిత్రంపైనే శ్రద్థ పెట్టారు. తెరకెక్కించే తరుణంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా కీలకంగా భావించి విజువల్‌ వండర్‌ను సృష్టించారు. ఆయనతోపాటు టీమ్‌ పడ్డ కష్టానికి  తగ్గ ప్రతిఫలంగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వరించింది. (Oppenheimer-OScar)

oppenheimer-2.jpg

‘ఓపెన్‌హైమర్‌’ సినిమా నిడివి ఎక్కువే. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రం ఇంటర్‌ 'స్టెల్లార్‌' 2గంటల49 నిమిషాలు కాగా, ఈ చిత్రం మూడు గంటల రన్‌టైమ్‌తో రూపొందింది. ఆయన చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది.  రన్‌టైమ్‌లో పెద్ద చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు విసిగిపోకుండా ఆదరించారు.

నోలన్ చిత్రాల్లో మనసును కదిలించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ‘ఓపెన్‌హైమర్‌’లో మొదటిసారి ఓ శృంగార సన్నివేశాన్ని పెట్టారు. ఈ సీన్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పనులు చేయాలంటే సవాల్‌గా ఉంటుంది. ఈ సీన్‌ పెట్టడానికి భయపడ్డాను. కథకు అవసరం అనిపించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ సన్నివేశాన్ని పెట్టాను’’ అని అన్నారు.

oppenheimer.jpg

ఇలాంటి విజువల్‌ వండర్‌కు కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ(సీజీఐ)ను ఉపయోగించడం తప్పనిసరి. కానీ ఆ విధానాన్ని ఉపయోగించకపోవడం గమనార్హం. ఇందులోని న్యూక్లియర్‌ పేలుడు సన్నివేశాలతో కూడిన క్లైమాక్స్‌ సీజీఐ సాయం లేకుండా రీక్రియేట్‌ చేశారు దీని గురించి దర్శకుడు ఓ సందర్భంలో చెప్పారు. క్వాంటమ్‌ డైనమిక్స్‌, ఫిజిక్స్‌ను వీలైనంత వాస్తవికంగా చిత్రీకరించాలనుకొని ఇలా చేసినట్లు తెలిపారు.

గతేడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై  ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో ఓ శృంగార సన్నివేశంలో మతగ్రంథాలను చూపించడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్‌ కాదంటూ పోస్ట్‌లు పెట్టారు. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే! వీటి అన్నింటిని దాటుకుని ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ ను తన వశం చేసుకుంది ఈ సినిమా. (Oppenheimer)

Updated Date - Mar 11 , 2024 | 11:35 AM