Youtube: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న.. హాలీవుడ్ సినిమాల‌ ట్రైల‌ర్లు

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:34 PM

యూట్యూబ్‌లో హాలీవుడ్ సినిమా ట్రైల‌ర్ల దండ‌యాత్ర సాగుతోంది. ఒక‌టి కాదు రెండు కాదు ఈ వారంలో ఇప్ప‌టికే మూడు మోస్ట్ ఎవ‌టైడ్ భారీ బ‌డ్జెట్ సినిమాల ట్రైల‌ర్లు విడుద‌ల‌య్యాయి.

Youtube: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న.. హాలీవుడ్ సినిమాల‌ ట్రైల‌ర్లు
youtube trailers

యూట్యూబ్ (YouTube)లో హాలీవుడ్ సినిమా ట్రైల‌ర్ల దండ‌యాత్ర సాగుతోంది. ఒక‌టి కాదు రెండు కాదు ఈ వారంలో ఇప్ప‌టికే మూడు మోస్ట్ ఎవ‌టైడ్ భారీ బ‌డ్జెట్ సినిమాల ట్రైల‌ర్లు విడుద‌ల‌య్యాయి. గ‌త నెల‌లో రెండు సినిమాల ట్రైల‌ర్లు విడుద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే యూట్యూబ్‌లో విడుద‌లైన ట్రైల‌ర్లు ఒక‌దాన్ని మించి మ‌రోట‌న్న‌ట్లుగా ఉండ‌డ‌మేగాక యాక్ష‌న్ సీన్స్‌, విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ యాక్ష‌న్ ప్రియుల‌కు గూస్‌బమ్స్ తెప్పిస్తూ సినిమాల‌పై అంచ‌నాల‌ను రెట్టింపు చేస్తున్నాయి.

images.jpg

ఇదిలాఉండ‌గా ఇప్ప‌టికే ట్విస్ట‌ర్స్ (Twisters) ,మేడమ్ వెబ్ (MADAME WEB), డ్యూన్ పార్ట్ 2 (Dune: Part Two), ఫ్యూరియోసా: ఎ మాడ్ మాక్స్ సాగా (FURIOSA : A MAD MAX SAGA) ట్రైల‌ర్లు విడుద‌ల‌వ‌గా.. గ‌డిచిన రెండు రోజుల్లో కింగ్‌డ‌మ్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Kingdom of the Planet of the Apes) , గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ (Godzilla x Kong: The New Empire) , ఏ క్వైట్ ఫ్లేస్ (A Quiet Place: Day One), డెడ్‌ఫూల్ అండ్‌ వోల్వ‌రైన్ (Deadpool & Wolverine) వంటి మ‌రో నాలుగు భారీ చిత్రాల ట్రైల‌ర్లు రిలీజై యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. అవి రిలీజైన‌ రెండు రోజుల్లోనే మిలియ‌న్ల‌లో వ్యూస్ సాధించి దూసుకు పోతున్నాయి. రానున్న నెల‌ రోజుల్లో మ‌రిన్ని చిత్రాల ట్రైల‌ర్లు రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తోంది.


అయితే ఇటీవ‌ల యూట్యూబ్‌లోకి వ‌చ్చిన ట్రైల‌ర్ల‌లో మేడమ్ వెబ్ (MADAME WEB) ఫిబ్ర‌వ‌రి 16న‌, ట్విస్ట‌ర్స్ (Twisters) జూలై 19న‌, డ్యూన్ పార్ట్ 2 (Dune: Part Two) మార్చి 15న‌, ఏ క్వైట్ ప్లేస్ (A Quiet Place: Day One) జూన్ 28న థియేట‌ర్ల‌లో కేవ‌లం ఇంగ్లిష్‌లో రిలీజ్ కానుండ‌గా, కింగ్‌డ‌మ్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Kingdom of the Planet of the Apes) మే 10న‌, గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ (Godzilla x Kong: The New Empire)

GGGDby8WIAA67j2.jpg

మార్చి 29న‌, డెడ్‌ఫూల్ అండ్‌ వోల్వ‌రైన్ (Deadpool & Wolverine) జూలై 26న‌ తెలుగులోను థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి. సో రానున్న ఆరు నెల‌ల్లో నెల‌కొక్క‌టి రెండు చొప్పున విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి. సో సినిమా ల‌వ‌ర్స్ ఇప్ప‌టి నుంచే ఫ్లాన్ వేసుకుని మీ వాచింగ్ లిస్టులో పెట్టుకుని ఆ చిత్రాల‌ను చూసేందుకు సిద్ధ‌మ‌వండి.

Updated Date - Feb 15 , 2024 | 03:42 PM