Golden Globe awards: 'ఓపెన్‌హైమర్‌’కు అవార్డుల పంట!

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:42 PM

‘గోల్డెన్‌ గ్లోబ్‌@ Goldenglobe awards) అవార్డు వేడుక ఘనంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో హాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేశారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘ఓపెన్‌హైమర్‌’కు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు దక్కింది.

Golden Globe awards: 'ఓపెన్‌హైమర్‌’కు  అవార్డుల పంట!

‘గోల్డెన్‌ గ్లోబ్‌@ Goldenglobe awards) అవార్డు వేడుక ఘనంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో హాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేశారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘ఓపెన్‌హైమర్‌’కు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు దక్కింది. సిలియన్‌ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఒక కాదు రెండు కాదు ఆరు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. మార్గోట్‌ రాబీ, ర్యాన్‌ గోస్లింగ్‌ నటించిన ‘బార్బీ’ కూడా పలు కేటగీరీల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

HF.jpg

అవార్డుల వివరాలు:

ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్‌ (Oppenheimer)

ఉత్తమ దర్శకుడు -  క్రిస్టఫర్‌ నోలన్‌(ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ కామెడీ చిత్రం- పూర్‌ థింగ్స్‌

ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి ( అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)

ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)

Untitled-2.jpg

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ - లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్)

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ - వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ) (Barbie)

ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్

ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్)

ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)

ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్)

బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు -  వార్నర్ బ్రదర్స్(బార్బీ)

Updated Date - Jan 08 , 2024 | 04:53 PM