మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Salaar part 2: 'సలార్' రెండో పార్టుపై తాజా అప్డేట్, ఇప్పట్లో లేనట్టే, ఎందుకంటే...

ABN, Publish Date - Apr 26 , 2024 | 06:05 PM

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఇప్పుడు పెద్ద సినిమాలపై దృష్టి పెట్టింది. 'పుష్ప 2' విడుదల తరువాత, ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా, హను రాఘవపూడి-ప్రభాస్ కాంబినేషన్ సినిమాల చిత్రీకరణ మొదలుపెట్టే విధంగా దృష్టి పెట్టినట్టుగా కనపడుతోంది.

Prabhas as Salaar

ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్' గత సంవత్సరం డిసెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించింది అని ఈ చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. ఇదే సినిమాలో మలయాళం నటుడు ప్రిధ్విరాజ్ సుకుమారన్ కూడా ఇంకో ప్రధాన పాత్రలో కనపడతాడు, శృతి హాసన్ కథానాయిక. ఈ సినిమా రెండో పార్టు చిత్రీకరణ కూడా త్వరలోనే జరగనుంది అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. (Salaar part two shooting postponed indefinitely)

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, 'సలార్ 2' సినిమా చిత్రీకరణ నిరవధికంగా వాయిదా పడింది అని పరిశ్రమలో చెపుతున్నారు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ 'సలార్ 2' చిత్రీకరణ కన్నా, ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా చిత్రీకరణ ముందుగా ప్రారంభం అవుతుందని, ఆ సినిమా విడుదలైన తరువాత మాత్రమే ప్రశాంత్ నీల్ 'సలార్ 2' చిత్రీకరణ మొదలుపెడతారని తెలిసింది. (Before 'Salaar 2', director Prashanth Neel to work with Junior NTR)

దీనికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నారని, ప్రస్తుతం 'కల్కి 2898 ఏడి' సినిమా చిత్రీకరణ ముగింపు దశలో వుంది, అది పూర్తిచేసి, ప్రభాస్ వెంటనే దర్శకుడు హను రాఘవపూడితో చెయ్యాల్సిన సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేస్తుండటం ఆసక్తికరం. ఈ సినిమాతో సమాంతరంగా ప్రభాస్, దర్శకుడు మారుతితో చేస్తున్న 'ది రాజా సాబ్' సినిమా చిత్రీకరణ కూడా చేస్తారని తెలుస్తోంది.

ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మొదటి పార్టు చిత్రీకరణ చేస్తూ, హిందీ సినిమా 'వార్' కూడా చేస్తున్నారు, మధ్యలో ప్రశాంత్ నీల్ తో చెయ్యాల్సిన సినిమాకి కూడా కొన్ని తేదీలు ఇస్తారని తెలుస్తోంది. (Prabhas to work with director Hanu Raghavapudi and then decided to work for Salaar 2) ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పెద్ద సినిమాలన్నిటికీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చెయ్యడం. అదే సంస్థ నుండి వస్తున్న 'పుష్ప 2' ఈ ఆగస్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకోసం ప్రపంచంలో ఎంతోమంది సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 06:05 PM