Eagle: సంక్రాంతి బరిలోంచి తప్పుకున్న రవితేజ 'ఈగల్'

ABN , Publish Date - Jan 04 , 2024 | 01:00 PM

ఎట్టకేలకు సంక్రాంతి బరిలో వున్న నిర్మాతల మధ్య ఒక సంధి కుదురైనట్టుగా తెలుస్తోంది. ఐదు సినిమాలు విడుదలకు తేదీల్ని ప్రకటించగా, ఇప్పుడు ఆ బరిలోంచి రవితేజ 'ఈగల్' తప్పుకుందని సమాచారం. దీనితో నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి.

Eagle: సంక్రాంతి బరిలోంచి తప్పుకున్న రవితేజ 'ఈగల్'
Ravi Teja from Eagle

గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక అనిశ్చితి నెలకొని వుంది. అదేంటి అంటే సంక్రాంతి పండగకి సుమారు ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు నేతృత్వంలో కొన్ని రోజులగా ఈ చిత్ర నిర్మాతలతో మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఇందులో ఎవరో ఒకరు వాయిదా వేసుకోవాలని, లేదంటే అన్ని సినిమాలకి థియేటర్స్ దొరకటం కష్టం అవుతుందని, ఆ తరువాత ఎవరినీ నిందించ వద్దనీ చెప్పారు.

అయితే ఎవరికీ వారు తాము వెనక్కి తగ్గేది లేదని, అందరమూ సంక్రాంతి తేదీకే ఫిక్స్ అయ్యామని సంక్రాంతికి వస్తామని భీష్మించుకు కూర్చున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ పోటీ నుండి రవి తేజ తప్పుకుంటున్నట్టుగా తెలిసింది. (Ravi Teja's 'Eagle' is out of Sankranthi race and now releasing on Jan 26)

ravitejanewfilm.jpg

రవితేజ నటిస్తున్న 'ఈగల్' సినిమా ఒక యాక్షన్ నేపథ్యంలో సాగే కథగా ఉంటుంది అని ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈగిల్ జనవరి 13న వస్తున్నట్టుగా అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడు నిర్మాతలందరూ మాట్లాడుకున్నాక, 'ఈగల్' సినిమా వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.

ఇప్పుడు 'ఈగల్' సినిమా జనవరి 26న వస్తున్నట్టుగా తెలిసింది. అదే రోజు రవి తేజ పుట్టినరోజు కావటం, రిపబ్లిక్ దినోత్సవం కూడాను అదే రోజు పడటంతో ఆరోజు సెలవు రోజు కావటంతో 'ఈగల్' సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరికేటట్టుగా చేస్తామని హామీ ఇచ్చిన్నట్టుగా తెలిసింది. అందుకని 'ఈగల్' సంక్రాంతి బరి నుండి తప్పుకొని జనవరి 26 న విడుదలవుతోంది తెలిసింది. ఇంకా ఇప్పుడు నాలుగు సినిమాలు మాత్రమే బరిలో ఉంటాయి. అవి 'హనుమాన్', గుంటూరు కారం', ‘సైంధవ్’, 'నా సామి రంగ'.

Updated Date - Jan 04 , 2024 | 01:07 PM