V Jayashankarr: జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ‘పేపర్ బాయ్, అరి’ దర్శకుడి చిత్రం!

ABN , Publish Date - May 10 , 2024 | 02:25 PM

సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా ‘పేపర్ బాయ్’ సినిమాలో చూపించి మెప్పించిన దర్శకుడు జయశంకర్. ఇక రెండో ప్రయత్నంగా ‘అరి’ అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

V Jayashankarr: జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ‘పేపర్ బాయ్, అరి’ దర్శకుడి చిత్రం!
V Jayashankarr and Jacqueline Fernandez

సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా ‘పేపర్ బాయ్’ (Paper Boy) సినిమాలో చూపించి మెప్పించిన దర్శకుడు జయశంకర్ (V Jayashankarr). ఇక రెండో ప్రయత్నంగా ‘అరి’ అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ అయింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు జయశంకర్ చేయబోయే సినిమాపై టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది.

అదేమంటే.. దర్శకుడు జయశంకర్ ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు నయనతార (Nayanthara) ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ వినిపిస్తోంది. జయశంకర్ అనుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌కు సౌత్, నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న నటిని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez)తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చేస్తున్నాడని తెలుస్తోంది.


Jacqline.jpg

పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక జయశంకర్ తీసిన ‘అరి’ (Ari) చిత్రం ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన అనంతరం థియేటర్లోకి రానుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

Read Latest Cinema News

Updated Date - May 10 , 2024 | 02:25 PM