Lalila: షైన్ స్క్రీన్స్‌లో విశ్వక్ సేన్ చేస్తున్న చిత్ర టైటిల్ ఇదే..

ABN , Publish Date - Mar 29 , 2024 | 11:54 PM

‘గామి’ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేశారు. విశ్వక్ సేన్ తన12వ సినిమా కోసం దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. VS12గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా విశ్వక్‌సేన్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘లైలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Lalila: షైన్ స్క్రీన్స్‌లో విశ్వక్ సేన్ చేస్తున్న చిత్ర టైటిల్ ఇదే..
Laila Movie Poster

‘గామి’ (Gaami) బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwaksen) కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేశారు. విశ్వక్ సేన్ తన12వ సినిమా కోసం దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. #VS12 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌ (Shine Screens) బ్యానర్‌పై సాహు గారపాటి (Sahu Garapati) నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌ ప్రొడక్షన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘భగవంత్ కేసరి’ మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు విశ్వక్‌తో ఈ బ్యానర్ నుండి ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రాబోతోంది. విశ్వక్ సేన్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి రామ్ నారాయణ్ (Ram Narayan) పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసి.. టైటిల్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

విశ్వక్ సేన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘లైలా’ (Laila) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్ కంప్లీట్ కలర్ ఫుల్‌గా ఉంది. పోస్టర్ ప్లజెంట్, వైలెంట్ వస్తువులతో బ్యాలెన్స్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. ఇందులో పూలు, సీతాకోక చిలుకలు, అద్దం, కొవ్వొత్తి, మేకప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకీ, నెత్తురోడుతున్న కత్తి, మేక తల మొదలైనవి ఉన్నాయి. టైటిల్ పోస్టర్ సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే క్యూరియాసిటీని కలిగిస్తుంది. (Laila Title Look Poster Out)


Laila-Poster.jpg

మోషన్ పోస్టర్‌లో చూపిన అన్ని ఎలిమెంట్స్‌ను విడివిడిగా చూపించారు. యానిమేషన్ పార్ట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. టైటిల్, మోషన్ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కు కూడా స్కోప్ ఉందనేది తెలియజేస్తున్నాయి. ఇందులో నటించే హీరోయిన్ పేరు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ మూర్తి రచయిత. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (Happy Birthday Vishwak Sen)


ఇవి కూడా చదవండి:

====================

*Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

************************

*VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

***********************

*Manchu Manoj: రామ్ చరణ్‌కి అర్థరాత్రి కాల్ చేశా.. క్షణంలో రూ. 5 లక్షలు పంపాడు

*****************************

Updated Date - Mar 29 , 2024 | 11:54 PM