Bengaluru Rave Party: సంచలన విషయాలు వెలుగులోకి, అడ్డంగా దొరికిపోయిన హేమ

ABN , Publish Date - May 23 , 2024 | 01:16 PM

బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అక్కడికి హాజరయిన వ్యక్తుల రక్తనమూనాలు బెంగుళూరు పోలీసులు పరీక్షకి పంపితే అందులో చాలామంది రక్త నమూనాలో డ్రగ్స్ వున్నట్టుగా బయటపడింది. తెలుగు నటి హేమ రక్త నమూనాలో కూడా డ్రగ్స్ వున్నాయని బెంగుళూరు పోలీసులు చెపుతున్నారు.

Bengaluru Rave Party: సంచలన విషయాలు వెలుగులోకి, అడ్డంగా దొరికిపోయిన హేమ
Hema

బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో రోజు రోజుకీ కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బెంగుళూరు పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్నా వారందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షకి పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. ఇప్పుడు ఈ విషయంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలిపోయింది.

ఈ రేవ్ పార్టీ తరువాత హేమ తాను అక్కడ లేనట్టుగా చిత్రీకరించడానికి బిర్యానీ ఎలా చేస్తారు లాంటి మామూలు వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమె రక్త నమూనాలో మాదకద్రవ్యాలు తీసుకున్నట్టుగా రూడీ అవటంతో ఇక ఆమె ఎన్ని చెప్పినా, ఆమె ఆ పార్టీలో వుంది, మాదకద్రవ్యాలు సేవించింది అనే విషయం స్పష్టం అయింది. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో గత ఆదివారం రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే.

Hema.jpg

ఈ రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్ అని తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు ​​జారీ చేయనుంది. అదే రేవ్‌పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌లోనే నటి హేమ ఉందని, ఆమె వీడియో అక్కడే రికార్డ్ చేసిందని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

తాను రేవ్‌పార్టీలో పాల్గొనలేదని, ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ అప్పట్లో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవ్‌పార్టీకి తాను వెళ్లలేదంటూ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధం అని అప్పుడే స్పష్టం అయింది. అయినా కూడా హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ మరో వీడియో వదిలారు. చివరకు బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్‌గా రావడంతో ఆమె బండారం బయటపడింది.

ఇది కూడా చదవండి

Bangalore Rave Party: రేవ్ పార్టీ అని తెలియదు.. నటి ఆషీ రాయ్ వీడియో వైరల్

Rave Party Hema: ఇది ఆమె నిజ స్వరూపం.. హేమపై సహనటి సంచలన వ్యాఖ్యలు

Updated Date - May 23 , 2024 | 01:39 PM