scorecardresearch

Aay: ‘ఆయ్’ ఫన్ ఫెస్టివల్‌లో ‘తండేల్’ టీమ్..

ABN , Publish Date - Aug 20 , 2024 | 08:56 PM

‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుదలై.. తొలి ఆట నుంచే ఈ ఫన్ ఎంటర్‌టైనర్ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది. ఈ సినిమా టీమ్‌ని రీసెంట్‌గా ఎన్టీఆర్ అభినందించగా.. ఈ లిస్ట్‌లోకి ఇప్పుడు ‘తండేల్’ టీమ్ చేరింది. చైతూ, సాయిపల్లవి ఈ చిత్ర టీమ్‌కు అభినందనలు తెలిపారు.

Aay: ‘ఆయ్’ ఫన్ ఫెస్టివల్‌లో ‘తండేల్’ టీమ్..
Aay team with Thandel Team

‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్‌ (Narne Nithin), న‌య‌న్ సారిక (Nayan Sarika) హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’ (Aay Movie). స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుదలై.. తొలి ఆట నుంచే ఈ ఫన్ ఎంటర్‌టైనర్ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది. సినీ ప్రేక్షకుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు సైతం ‘ఆయ్’ సినిమాను చూసి అద్భుత‌మంటూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్ప‌టికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి అభినందించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ‘ఆయ్’ ఫ‌న్ ఫెస్టివ‌ల్‌ (Aay Fun Festival)లో మ‌రో క్రేజీ టీమ్ కూడా జాయిన్ అయ్యింది. అదే ‘తండేల్’ టీమ్‌ (Thandel Team).

Also Read- Hema: సీఎం రేవంత్, పవన్  కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కావాలి!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య (Naga Chaitanya), వెర్స‌టైల్ యాక్ట్రెస్ సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) ఈ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ అభినందన కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి, నిర్మాత బ‌న్నీ వాస్‌, ద‌ర్శ‌కుడు అంజి కె.మ‌ణిపుత్ర‌, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమాస్ క‌సిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. విడుదలైన తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్‌తో వరుసగా షోలు, స్క్రీన్లు పెంచుకుంటూ వెళుతున్న ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటూ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.


Chaitu.jpg

మొదటి రోజు ఈ సినిమాకు అరవై లక్షల గ్రాస్ వస్తే.. నాలుగో రోజుకి 2.2కోట్ల గ్రాస్ వచ్చింది. తొలిరోజుతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా వసూళ్లు వచ్చాయి. ఇలా రోజు రోజుకి సినిమా క‌లెక్ష‌న్స్ పెరుగుతుండటంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ, సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతోంది. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అంజి కె.మ‌ణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. ‘తండేల్’ టీమ్‌, ‘ఆయ్’ టీమ్‌ని అభినందిస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Latest Cinema News

Updated Date - Aug 20 , 2024 | 08:56 PM

Aay Movie Review: ఎన్టీఆర్ బావమరిది సినిమా 'ఆయ్' ఎలా ఉందంటే

Aay Movie: అమ్మలాలో రామ్ భజన లిరికల్ వీడియో

AAY Theatrical Trailer: నార్నే నితిన్ ‘ఆయ్’ ట్రైల‌ర్‌

Aay: ‘ఆయ్’ మూవీ థీమ్ సాంగ్

AAY: నాయ‌కి ఏమైనాదే.. మ‌రి రంగనాయ‌కి ఏమైనాదే! పాట‌.. అదిరిపోయిందిగా