Aay: ట్రెండింగ్‌లో మెలోడీ గీతం.. ‘సూఫియానా..’

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:57 PM

GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి.. ‘సూఫియానా’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Aay: ట్రెండింగ్‌లో మెలోడీ గీతం.. ‘సూఫియానా..’

GA2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’ (Aay). నార్నే నితిన్ (Narne Nithin), నయన్ సారిక (Nayan Sarika) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి (Anji Kanchipalli) ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తుండగా.. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి (Bunny Vas and Vidya Koppineedi) ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఫస్ట్ లుక్‌ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి మెలోడి ఆఫ్ ది సీజ‌న్ అనిపించేలా ‘సూఫియానా..’ (Sufiyana Song) అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ మధ్యకాలంలో సూప‌ర్ హిట్ పాట‌ల‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రామ్ మిర్యాల (Ram Miriyala) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘సూఫియానా..’ సాంగ్‌ను రామ్ మిర్యాల‌, స‌మీర భ‌ర‌ద్వాజ్‌, ర‌మ్య‌శ్రీ పాడారు. శ్రీమ‌ణి ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. చ‌క్క‌గా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఈ లిరికల్ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది. అంద‌మైన లొకేష‌న్స్‌, బ్యాగ్రౌండ్‌లో అల‌రించే గోదావ‌రి అందాలు.. నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక మ‌ధ్య క‌నిపిస్తోన్న కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను అలరింపజేస్తోంది. సింపుల్ కొరియోగ్ర‌ఫీలో ‘సూఫియానా..’ మెలోడి సాంగ్ అంద‌రి హృద‌యాల‌ను ఆక‌ట్టుకునేలా ఉంది.


Narne-1.jpg

‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

Narne-2.jpg


ఇవి కూడా చదవండి:

====================

*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్

********************************

*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?

***************************

*Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!

*************************

Updated Date - Mar 20 , 2024 | 12:57 PM