Latest Update on Ranveer, Prashanth Varma Film: వున్నట్టా, లేనట్టా, కేవలం ప్రచారమేనా...

ABN , Publish Date - May 22 , 2024 | 02:23 PM

ఇంతకీ ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ సినిమా వున్నట్టా, లేనట్టా అని ఒక చర్చ నడుస్తోంది. వుంది అని ఒక మీడియా రాస్తుంటే, లేదు అని ఇంకొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం ప్రచారం కోసమేనా ఈ హంగామా, అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ ఊహాగానాలు ఇలానే వుంటాయని తెలుస్తోంది.

Latest Update on Ranveer, Prashanth Varma Film: వున్నట్టా, లేనట్టా, కేవలం ప్రచారమేనా...
Prashanth Varma and Ranveer Singh

దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు 'హనుమాన్' సినిమా విజయంతో ఒక్కసారిగా మారుమోగింది. అతను తదుపరి సినిమా కూడా 'హనుమాన్' సినిమాకి సీక్వెల్ గా 'జై హనుమాన్' తీస్తున్నట్టు ప్రకటించారు. అందులో అగ్రనటులు నటిస్తున్నారని వార్తలు బాగా వ్యాప్తి చెందిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈలోగా ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రణవీర్ సింగ్ తో సినిమా చేస్తున్నాడు అని ఒక వార్త వచ్చిన విషయం కూడా తెలిసిందే. (Latest Update on Prashanth Varma and Ranveer Singh film)

prashanthvarmahanuman.jpg

ప్రశాంత్ వర్మ, ముంబై వెళ్లి రణవీర్ సింగ్ ని కలిసిన మాట నిజమని తెలుస్తోంది. అలాగే రణవీర్ సింగ్ కి కథని కూడా వినిపించాడని, అందుకు రణవీర్ ఒప్పుకున్నాడని, వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం రణవీర్ సింగ్, ప్రశాంత్ వర్మ ఇద్దరూ హైదరాబాదులోనే విమానాశ్రయంలో కనిపించారు. అది చూసి ఈ ఇద్దరి కలయికలో సినిమా ఖాయం అయిపొయింది, ఇక అధికారికంగా ప్రకటనే తరువాయి అని కూడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. (Prashanth Varma and Ranveer Singh film Latest Update)

కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ సినిమా జరగటం లేదని కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి. రణవీర్ సింగ్ కి కథ ఎందుకో అంతగా నచ్చలేదని, అందుకని అతను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు అని వార్త. లేదు లేదు, సినిమా అయితే వుంది, అటువంటిదేమీ లేదు, రణవీర్ సింగ్ తెలుగు దర్శకుడితో చెయ్యడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు అని ఇంకొక వార్త కూడా నడుస్తోంది.

ranveersinghnew.jpg

ఇలా రెండు రకాల వార్తలతో సామజిక మాధ్యమాల్లో, వెబ్ మీడియాలో వార్తలు రావటంతో అసలు ఈ ఇద్దరి కలయికలో సినిమా వున్నట్టా, లేనట్టా అని ఇంకొక చర్చ జరుగుతోంది. ఈ సినిమా గురించి అధికారికంగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు. 'హనుమాన్' సినిమా విజయవంతం అయింది, ఆ విజయాన్ని తన తదుపరి సినిమాకి ఉపయోగించుకోవాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నారు, అందుకనే రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ తెరపైకి తీసుకువచ్చారు అని ఇంకొక వాదన. ఇలా ఎవరికీ వారు ఈ సినిమా గురించి ఊహాగానాలు చేసుకుంటూ వున్న ఈ సమయంలో ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ లేదా ఈ సినిమాని ఎవరు నిర్మించాలని అనుకున్నారో సదరు నిర్మాతలు ఏదైనా ప్రకటన ఇస్తే ఇటువంటి ఊహాగానాలకు తెర దించినట్టవుతుంది అని చెపుతున్నారు.

Updated Date - May 22 , 2024 | 02:27 PM