ట్రావెల్ నేపధ్యం సినిమాలో అనుపమ, కాన్సెప్ట్ వీడియో విడుదల చేయనున్న సమంత

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:37 PM

మొదటి సినిమా 'సినిమా బండి' తో మంచి పేరు సంపాదించిన దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఇప్పుడు రెండో సినిమాతో రెడీ అయిపోయారు. రేపు ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు సమంత, రాజ్ డీకేలు చెప్తారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక, దర్శన రాజేంద్రన్, సంగీత ఇంకో రెండు ముఖ్య పాత్రల్లో కనపడతారు

ట్రావెల్ నేపధ్యం సినిమాలో అనుపమ, కాన్సెప్ట్ వీడియో విడుదల చేయనున్న సమంత
Anupama Parameswaran

మూడేళ్ళ క్రితం 'సినిమా బండి' అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై అప్పట్లో వైరల్ అయింది. ఈ సినిమాతో ప్రవీణ్ కాండ్రేగుల అనే అబ్బాయి దర్శకుడిగా పరిచయం అయ్యాడు, ప్రముఖ జంట దర్శకులు రాజ్, డీకేలు ఆ 'సినిమా బండి'కి నిర్మాతలు. అందులో ఇంచుమించు అందరూ కొత్త నటీనటులే అవడం ఆసక్తికరం. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండో సినిమా రెడీ చేసేసుకున్నాడు, రేపు ఈ సినిమా గురించి బయట ప్రపంచానికి చెప్పనున్నాడు.

praveenkandregula.jpg

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆమెతో పాటు తమిళ నటి దర్శన రాజేంద్రన్ ఈ సినిమాతో తెలుగులోకి ఆరంగేట్రం చేయనుంది. అలాగే ఒకప్పటి కథానాయిక సంగీత కూడా ఇందులో ఇంకో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా మొదటి గ్లిమ్ప్స్ ని ప్రముఖ కథానాయిక సమంత, రాజ్, డీకే లు రేపు విడుదల చేయనున్నారు.

samanthaglamphoto.jpg

ఇది మహిళలు ప్రధానంగా వుండే సినిమాగా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు ఇందులో ఈ ముగ్గురు నటీమణులను దృష్టిలో పెట్టుకొని కథని రాసినట్టుగా తెలుస్తోంది. అదీ కాకుండా అతని అభిప్రాయం ప్రకారం ఈ ముగ్గురూ దక్షిణాదిలో మంచి ప్రతిభ కల నటీమణులని నమ్మడంతో ఈ ముగ్గురితో ఈ సినిమా చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని, అలాగే సాహసోపేతంగా ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ ముగ్గురి నటనే ఈ సినిమాకి హైలైట్ అని కూడా తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయి, రేపు ఈ సినిమా గురించి ఒక వీడియో బయటకి వస్తే ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలుస్తుంది అని కూడా అర్థం అవుతోంది.

Updated Date - Apr 25 , 2024 | 05:37 PM