Samantha : సామ్‌ పోస్ట్‌ వైరల్‌!

ABN , First Publish Date - 2023-10-09T18:41:49+05:30 IST

కాస్త సమయం కుదిరితే సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు సమంత (Samantha). తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తుంటారు. తాజాగా సమంతపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.

Samantha :  సామ్‌ పోస్ట్‌ వైరల్‌!

కాస్త సమయం కుదిరితే సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు సమంత (Samantha). తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తుంటారు. తాజాగా సమంతపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ వైరల్‌ అయింది. సమంతకు పెట్స్‌ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. తన పెంపుడు కుక్కపిల్ల హ్యాష్‌కు సంబంధించిన ఫొటోలను అది చేసే అల్లరి వీడియోలను అప్పుడప్పుడూ షేర్‌ చేస్తుంటారు. తాజాగా నాగచైతన్య షేర్‌చేసిన ఫొటోల్లో ఈ కుక్కపిల్ల కనిపించడంతో పలువురు నెటిజన్లు కొత్త చర్చ ప్రారంభించారు. రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

Samantha.gif

ఈ మేరకు సమంత ఒక కొటేషన్‌ను షేర్‌ చేశారు. ‘దయా గుణాన్ని వ్యూహంగా కాకుండా.. జీవిత మార్గంగా అలవరుచుకునే వారికి హ్యాట్సాఫ్‌’ అని ఉన్న ఫొటోలను ఆమె ఇనస్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. వస్తున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టడం కోసం సామ్‌ ఈ పోస్ట్‌ పెట్టిందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ‘ఖుషి’తో ఆకట్టుకున్న సమంత ‘సిటాడెల్‌’ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం రిలాక్స్‌ అవుతున్నారు సామ్‌.

Updated Date - 2023-10-09T18:54:44+05:30 IST