Nayak: గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీ రిలీజ్

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:41 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించారు.

Nayak: గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీ రిలీజ్
nayak

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ (Nayak) రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), అమలాపాల్ (Amala Paul) నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.

ram charann.jpg

దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీ రిలీజ్ అయితే మళ్ళీ చూడాలని ప్రేక్షకాభిమానులు కోరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (Nattis Entertainments) ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, "మార్చి 27న రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డేని పురస్కరించుకుని, కాస్త ముందుగా మార్చి 23న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం. ఇందులో రామ్ చరణ్ తన పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు.

nayakk.jpeg

హీరోయిన్లు కూడా పోటీ పడి నటించారు. మిగతా పాత్రధారులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. చిత్రంలో అన్ని అంశాలు ఉన్నాయి. కామెడీకి కూడా పెద్ద పీట వేశారు. తమన్ సంగీతాన్ని అందించిన ప్ర‌తీ పాట హైలైట్ గా ఉంటుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఓ ఆకర్షణగా నిలుస్తుంది" అని అన్నారు.

Updated Date - Mar 07 , 2024 | 12:57 PM