Pinky: ‘పింకీ’ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - Jan 04 , 2024 | 07:31 PM

విఆర్‌పి క్రియేష‌న్స్ ప‌తాకంపై పి. ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్‌, మౌర్యాణి జంట‌గా సుమ‌న్, శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి అట్లూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘పింకీ’. సీర‌పు ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమ‌వుతోంది.

Pinky: ‘పింకీ’ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే?
Pinky Movie Press Meet

విఆర్‌పి క్రియేష‌న్స్ ప‌తాకంపై పి. ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్‌, మౌర్యాణి జంట‌గా సుమ‌న్, శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి అట్లూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘పింకీ’. సీర‌పు ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఫిలించాంబ‌ర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో టాలీవుడ్ ప్రముఖులు ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ‌, సాయి వెంక‌ట్‌లతో పాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ.. పింకీ టైటిల్‌తో వివిధ భాషల్లోవ‌చ్చిన చిత్రాలన్నీ ఘ‌న విజ‌యం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్‌తో వ‌స్తోన్న ఈ చిత్రం కూడా మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా. వెంక‌ట ర‌మ‌ణ వ‌రుస‌గా చిత్రాలు చేస్తూ.. ఓ  కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం క‌ల్పిస్తూ ఈ సినిమా చేయ‌డం మెచ్చుకోవాల్సిన విషయం. కొత్త వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తూ చేసే చిత్రాల‌ను ఆద‌రిస్తే ఇంకా ఎంతో మందికి అవ‌కాశాలు వ‌స్తాయి. ర‌వికుమార్ ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం చేసిన‌ట్లు పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లని అన్నారు. నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. వెంకట రమణ ఒక ద‌ర్శ‌కుడు అయ్యుండి మ‌రో ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వ‌డం గొప్ప విష‌యమని అన్నారు నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ మరియు సాయి వెంకట్. న‌టుడు ర‌వి అట్లూరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సీనియ‌ర్ ఆర్టిస్ట్ చేయాల్సిన పాత్ర ఇచ్చి.. న‌న్ను ప్రోత్స‌హించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలని తెలిపారు. (Pinky Movie Press Meet)


Pinky-Movie.jpg

హీరో కిర‌ణ్ మాట్లాడుతూ.. నాకు ఈ చిత్రంలో హీరోగా అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. దర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు సినిమా. ఈ సినిమా విడుద‌ల‌కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నానని అంటే.. చిత్ర ద‌ర్శ‌కుడు సీర‌పు ర‌వి కుమార్ మాట్లాడుతూ.. ఇది నా మొద‌టి సినిమా. నిర్మాత ఎక్క‌డా రాజీ పడ‌కుండా సినిమా బాగా రావ‌డానికి స‌హ‌క‌రించారు. ఒక డైమండ్ కోసం జ‌రిగే అన్వేష‌ణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని తెలిపారు. నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ మాట్లాడుతూ..1980లో మ‌ద్రాసు వెళ్లి అక్క‌డ ప్ర‌ముఖుల‌తో ప‌ని చేశాను. ఆ త‌ర్వాత ‘జ‌రిగిన క‌థ‌, జ‌నం’ చిత్రాలు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాను. వాటికి మంచి పేరొచ్చింది. ఆద‌ర్శ భావాల‌తో ఆ రెండు చిత్రాలు చేశాను. ప్ర‌జంట్ ‘జ‌నం పార్ట్ 2’ షూటింగ్‌లో ఉంది. సీర‌పు ర‌వి కుమార్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ‘పింకీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ద‌ర్శ‌కుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతిథులందరికీ ధన్యవాదాలు అని అన్నారు. (Pinky Telugu Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

*****************************

*దీనస్థితిలో ఉన్న న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ సాయం

**************************

*Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

************************

Updated Date - Jan 04 , 2024 | 07:31 PM