Passion: ‘ప్యాషన్’ అప్‌డేట్ ఇదే..

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:17 PM

సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ప్యాషన్’. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. బిఎల్‌ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతుండగా.. రెండో షెడ్యూల్‌కు టీమ్ రెడీ అయినట్లుగా మేకర్స్ తెలిపారు.

Passion: ‘ప్యాషన్’ అప్‌డేట్ ఇదే..
Passion Movie Still

సుధీష్ వెంకట్ (Sudheesh Venkat), అంకిత సాహ (Ankita Saha), శ్రేయాసి షా (Sreyasi Shah) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ప్యాషన్’ (Passion). ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను బిఎల్‌ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. ‘ప్యాషన్’ చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా (Arvind Joshua) దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అరవింద్ జోషువా స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూట్ జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. రెండో షెడ్యూల్‌కు మూవీ టీమ్ రెడీ అవుతోందని తెలిపారు. (Passion Film Latest Update)

Also Read: Super Star Krishna Brother: ఈ ఫొటోలో ఉన్నది కృష్ణ కాదంటే ఎవరైనా నమ్మగలరా?


Passion-2.jpg

ఈ సందర్భంగా దర్శకుడు అరవింద్ జోషువా (Director Arvind Joshua) మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజులపాటు సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలని చిత్రీకరించాం. ఇప్పుడు రెండవ షెడ్యూల్‌కి సిధ్ధమవుతున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎపుడూ రానటువంటి ఒక సమగ్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో వస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా ‘ప్యాషన్’ (Passion Movie) అని చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంటుందని అన్నారు.

Read Latest Cinema News

Passion-3.jpg

Updated Date - Jun 02 , 2024 | 01:17 PM