Maruva Tarama: ‘పరవశమే’.. ఈ మెలోడీని ‘మరువ తరమా’!

ABN , Publish Date - Feb 23 , 2024 | 04:08 PM

అద్వైత్ ధనుంజయ హీరోగా.. అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మరువ తరమా’. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పరవశమే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Maruva Tarama: ‘పరవశమే’.. ఈ మెలోడీని ‘మరువ తరమా’!

ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌కు ఎప్పుడూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. యూత్ ఆడియెన్స్ అంతా కూడా లవ్ స్టోరీలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇప్పుడలాంటి ఓ ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఒకటి ప్రేక్షకుల కోసం రెడీ అవుతోంది. అద్వైత్ ధనుంజయ (Adhvaith Dhanunjaya) హీరోగా.. అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మరువ తరమా’ (Maruva Tarama). సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పరవశమే’ (Paravasame Lyrical Video) అంటూ సాగే మెలోడీ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.


Maruva-Tarama-2.jpg

ఈ పాట నిజంగానే ‘మరువ తరమా’ అన్నంత వినసొంపుగా ఉంది. విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) బాణీ ఎంతో శ్రావ్యంగా ఉండగా.. చైతన్య వర్మ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్ గాత్రం ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా రుద్ర సాయి, ఎడిటర్‌గా కె.ఎస్.ఆర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Tantra: పిల్ల బచ్చాల్లారా.. మా సినిమాకు రావద్దు.. వార్నింగ్ అదిరింది

************************

*Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ RC 16పై ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

************************

*BVS Ravi: ఆత్మలని పిలవకుండా.. వాళ్లింట్లోనే పేరంటమా?

**************************

Updated Date - Feb 23 , 2024 | 04:08 PM